రంభ రీ ఎంట్రీ.. ఈ సారి జడ్జిగా

rambha joins abcd as a judge on zee telugu

ఒకప్పటి హీరోయిన్ రంభ అంటే తెలుగు, తమిళ్, హింది, మలయాళం భాషలో కూడా ఓ రేంజిలో క్రేజ్ .తన గ్లామర్ తో పాటు నటన తో కూడా కుర్రకారుకు మతులు పోగొట్టే ఆమె తన డాన్స్ తో ఆ రోజుల్లో బాలకృష్ణ చిరంజీవి లాని మంచి డాన్సర్స్ కి కూడా గట్టి పోటీ ని ఇచ్చేది.

ఆ తర్వాత గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ యమదొంగలోనూ ఓ స్పెషల్ సాంగ్ నాచోరే నాచోరే అంటూ అదరకొట్టింది. హీరోయిన్ న్‌గానే కాకుండా డ్యాన్‌స్ లోనూ కొత్త ఒరవడి సృష్టించిన రంభ… ఇప్పుడు తమ టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకొనే వారికి వేదిక కాబోతున్న ‘ఏబీసీడీ’ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నట్లు జీ తెలుగు ప్రతినిధి గురు వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వెండి తెరపై ఆఫర్స్ తగ్గిన చాలామంది హీరోయిన్స్ మెల్లిగా బుల్లితెరకు షిప్ట్ అవుతున్న విషయం తెలిసిందే. సీరియల్స్ లో నటించడంతో పాటు, డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు కూడా. రీసెంట్ గా పెళ్లి , విడాకులు అంటూ వివాదాల్లో ఎరుక్కున్న రంభ .. తాజాగా ‘ఏబీసీడీ’ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం.

Related

  1. కమెడియన్స్ మధ్య బిగ్ వార్!
  2. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  3. యాంకర్ ను తాకరాని చోట తాకాడట!
  4. పైట జారితే ఊరుకునేది లేదు- యాంకర్ శ్యామల