Thursday, May 30, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ ప్లాప్ అవ్వచ్చు ?

- Advertisement -

కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో రాబోతున్న జనతా గ్యారేజ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివర్లో ఉంది. ఈ పాటికే సినిమా హడావిడి మొదలు అవ్వాల్సి ఉంది కానీ సినిమాని పోస్ట్ పోన్ చెయ్యడం వలన ఇంకా సినిమా విడుదల ఆలస్యం అవుతోంది.

అయితే ఈ సినిమా లో ఒక ఐటం సంగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. తమన్నా తో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు శివ. ఇప్పుడు ఆ తమన్నానే గ్యారేజ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఐటం సాంగ్ కోసం ఒప్పించాడట. తమన్నా, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి.  అందుకే ఈ ఇద్దరితో ఐటం సాంగ్ అయితే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని ఆమెను కన్విన్స్ చేసి ఓకే చేయించారట.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాలో సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఇప్పుడు తమన్నా ఐటం సాంగ్ కూడా వచ్చి చేరింది కాబట్టి ముగ్గురి హీరోయిన్స్ తో తారక్ రొమాన్స్ అదరగొడతాడని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సంచలనాలు సృష్టిస్తున్న గ్యారేజ్ రిలీజ్ తర్వాత అన్ని రికార్డులను సెట్ చేయడం ఖాయమని తెలుస్తుంది.  

కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈ విషయం లో భయపడుతున్నారు, ఇప్పటికే తమన్నా ని ఐరన్ లెగ్ అని పిలుస్తున్నారు. ఆమె సినిమాల్లో ఈ మధ్య కాలం లో ఊపిరి, బాహుబలి తప్ప ఏవీ సరిగ్గా ఆడలేదు. అందుకే ఈ సినిమాకి నెగెటివ్ గా ఈమె తయారు అయ్యి ప్లాప్ అవుతుంది ఏమో అని ఫాన్స్ భయపడుతున్నారు.

Related

  1. టెంపర్ కి మించిన రోల్ లో ఎన్టీఆర్
  2. గూగుల్‌ వల్ల ఎన్టీఆర్ సీఎం అయ్యారు!
  3. ఎన్టీఆర్ స్వార్ధం కోసమే జనత గ్యారేజ్ వాయిదా ?
  4. జనతా గ్యారేజ్ లో మరో హీరో!
  5. జనతా గ్యారేజ్ సాంగ్ లీక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -