- Advertisement -

ఆరేళ్ల తర్వాత రష్మిక – విజయ్!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ హాట్ టాపిక్. వీరిద్దరి రిలేషన్ షిప్‌పై కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ తర్వాత ఈ జంట కలిసి పని చేయలేదు. దాదాపు ఆరు ఏళ్ల గ్యాప్ తర్వాత, విజయ్ దేవరకొండ–రష్మికలు మళ్లీ కలసి నటించబోతున్నారు.

VD14గా పిలుస్తున్న ఈ చిత్రం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పీరియడ్ డ్రామాగా, 1800ల నేపథ్యంలో సాగనుందని సమాచారం. వీరిద్దరి కలయికలో వచ్చిన గీత గోవిందం బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.

రష్మిక పాన్-ఇండియా స్టార్‌గా ఎదుగుతూ పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్, యానిమల్, ఛావా, కుబేరా వంటి బ్లాక్‌బస్టర్లు అందించగా, విజయ్‌కు మాత్రం పాన్-ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ లైగర్ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడీ జంట మళ్లీ కలవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక–విజయ్ కాంబోలో రానున్న ఈ చిత్రం గీతగోవిందం లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -