రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రజల భద్రత కోసం నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 243 మందిని పట్టుకున్నారు. వీకెండ్‌లో కీలక మార్గాలు, రాత్రి వేళ చెక్‌పోస్టుల వద్ద ఈ ప్రత్యేక దాడులు నిర్వహించారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.
189 ద్విచక్ర వాహనాలు,13 త్రిచక్ర వాహనాలు,40 నాలుగుచక్ర వాహనాలు,1 భారీ వాహనం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అధిక ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.
రక్తంలో మద్యం శాతం (BAC) వివరాలు
207 మంది: 36 mg/100 ml నుండి 200 mg/100 ml వరకు
24 మంది: 201 mg/100 ml నుండి 300 mg/100 ml వరకు
12 మంది: 301 mg/100 ml నుండి 550 mg/100 ml వరకు
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. మత్తులో వాహనం నడిపి ప్రాణనష్టం కలిగిస్తే బీఎన్‌ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం తాగి పట్టుబడిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది అని తెలిపారు. రోడ్డు భద్రత కోసం ఈ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, సురక్షిత ప్రయాణ మార్గాలు ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
