Wednesday, April 24, 2024
- Advertisement -

కవలలకు జన్మనివ్వనున్న 74 ఏళ్ల వృద్ధురాలు…

- Advertisement -

ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరగుతుంటాయి.అందులో కొన్ని సైన్స్ కి అర్ధం అయినా మరి కొన్ని ఎరవికి అర్థం కావు. అలాంటి సంఘటనే చోటు చేసుకోబోతోంది. 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన వృద్ధురాలు కవల పిల్లలకి జన్మనివ్వబోతోంది. ప్రస్తతం ఇదే ప్రంపచ రికార్డు.తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962లో వివాహమైంది.

పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. కాని ఫలితం లేకుండా పోయింది.వృద్ధాప్యం వచ్చినా కూడా ఆ కోరిక అలానె ఉండిపోయింది.అయితే ఈ మధ్యనే వారి ఇంటి దగర్లో ఒక మహిళ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యారు.

ఉన్నత కుటుంబం కావడంతో తానూ పిల్లల కోసం ఆ పద్ధతిని ఆశ్రయించాలని మంగాయమ్మ నిర్ణయించుకుని ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆమె మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించిణ వైద్యులు ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) పద్ధతిలో ప్రయత్నంచి విజయవంతం అయ్యారు.మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది.

ఈ ఏడాది జనవరిలో గర్భం దాల్చిన ఆమెకి వయసు రీత్యా సాధారణ ప్రసవం కష్టం కాబట్టి సిజేరియన్‌ ద్వారా ఈరోజు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కవలలను బయటకు తీయనున్నారు.నెలలు నిండటంతో సెప్టెంబర్‌ 5న ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆపరేషన్‌ చేస్తామన్నారు. కాగా.. స్కానింగ్‌లో మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్లు తెలిసిందని డాక్టర్లు చెబుతున్నారు.

గతంలో 72 సంవత్సరాలకు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ మగ బిడ్డకు జన్మ ఇచ్చారు. ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ బిడ్డను కంటే ఆ రికార్డు చెరిగిపోయి ఇదే ప్రపంచ రికార్డు కానుంది. దీని పైన ఇప్పుడు వైద్య నిపుణులుతో పాటుగా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -