Tuesday, May 14, 2024
- Advertisement -

సీమాంధ్రుల వ్యక్తిత్వంపై నీచపు మాటలు…. ఇంకా ఆర్కేని క్షమించాలా?

- Advertisement -

చంద్రబాబు భజన చేస్తున్నాడు కాబట్టి, బాబును అధికారంలోకి తీసుకురావడం కోసం అహర్నిశలూ అన్ని జర్నలిజం విలువలకూ తిలోదకాలిచ్చి మరీ దిగజారుడు రాతలు రాస్తాడు కాబట్టి రాధాకృష్ణ అంటే టిడిపిని అభిమానించేవారికి సానుకూల అభిప్రాయం ఉండొచ్చు. ఇప్పటికే ఎన్నోసార్లు సీమాంధ్రుల గురించి నీచమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు రాధాకృష్ణ. తెలంగాణా విభజన సమయంలో కూడా తెలంగాణా వాసులతో పోల్చుతూ సీమాంధ్రులను ఎటకారం చేశాడు. ఇప్పుడు మరోసారి అంతకుమించి అనే స్థాయిలో సీమాంధ్రులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు రాధాకృష్ణ.

వారం వారం బాబు భజన కోసం రాసే ‘కొత్త పలుకు’లో ఈ సారి కూడా చంద్రబాబు భజన బ్రహ్మాండంగా చేశాడు. పనిలో పనిగా వైఎస్ జగన్‌పై విమర్శలు కూడా అదే స్థాయిలో చేశాడు. రాధాకృష్ణ నైజం అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన రాజకీయాల గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే ఇదే వ్యాసంలో తెలంగాణావారితో పోల్చుతూ సీమాంధ్రులను తీవ్రస్థాయిలో అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆక్షేపణీయం. ఒక మీడియా అధిపతిగా ఉంటూ ఈ స్థాయిలో దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.

‘ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే తెలంగాణా వారు సంతృప్తి పడిపోతారు. చాలా రోజులు ఆ భోజనం పెట్టినవాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అదే ఎపిలో ఎవరినైనా భోజనానికి పిలిస్తే నాతో ఏదో పని ఉండి భోజనానికి పిలిచాడు అని అనుకుంటారు’…….. ఇవీ సీమాంధ్రుల వ్యక్తిత్వం గురించి రాధాకృష్ణ వ్యాఖ్యలు. చదివిన వెంటనే ఛీ అనిపించడం లేదా……. సీమాంధ్రులపై ఇంత నీచమైన అభిప్రాయం ఉన్న వ్యక్తి ఇక ఆ సీమాంధ్రుల ప్రయోజనాల కోసం జర్నలిజం చేస్తున్నాడంటే నమ్మాలా? పార్టీ, కులం కోణాన్ని పక్కన పెట్టి చూస్తే సమైక్యాంధ్ర ప్రదేశ్ కాలం నుంచీ కూడా ఎన్నో సార్లు, ఎన్నో విషయాల్లో సీమాంధ్రులను తీవ్రంగా అవమానపరిచే, గాయపరిచే వ్యాఖ్యలు చేశాడు రాధాకృష్ణ.

ఇప్పుడు మరోసారి అవమానించడం, తక్కువ చేయడమే పరమావధిగా తెలంగాణా ప్రజలతో పోల్చి వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ రాధాకృష్ణ విషయంలో, ఆయన మీడియా సంస్థ, ఆ సంస్థ వండివార్చు వార్త కథల విషయంలో సీమాంధ్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. ఇప్పుడు కూడా క్షమిస్తే ముందు ముందు రాధాకృష్ణ ఇంకా ఏ స్థాయిలో సీమాంధ్రులను అవమానిస్తూ వ్యాఖ్యలు చేస్తాడో కూడా చూడాలి. ఆల్రెడీ సోషల్ మీడియాలో ‘ఛీ…..ఛీ…రాధాకృష్ణ’ అంటూ ఘాటు కామెంట్స్ పడుతున్న నేపథ్యంలో రాధాకృష్ణ నుంచి సవరణ ప్రకటన ఏమైనా వస్తుందేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -