Sunday, May 26, 2024
- Advertisement -

తప్పు ఒప్పుకున్న ఏబిఎన్ రాధాకృష్ణ

- Advertisement -

ప్రస్తుత న్యూస్ ప్రపంచంలో కంచె ఐలయ్య ఎంత పెద్ద న్యూస్ మేకర్ గా మారాడో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతని వాగ్దాటికి మహా మహులు సైడై పోతున్నారు. ఒక్క టీవి 9 మురళీ కృష్ణ మాత్రమే అతన్ని కళ్లలో రక్తం గడ్డ కట్టేలా చేశాడు. పంచ్ మాస్టర్ గా చెపుకునే రజనీకాంత్ సైతం కంచెను అంచనా వేయలేకపోయాడు.

ఈ ప్రాసెస్ లో టీవి9 హిందూ వ్యతిరేకిగా ముద్రవేయించుకున్నంత పని చేసింది. ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి రీసెంట్ ఫాస్టర్ల మీద పడి వారి బండారాలు భయట పెడుతుంది. తాజాగా టివి 9 చేసిన పనే ఆంధ్రజ్యోతి చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఓ అడుగు ముందుకు వేసి కంచె ఐలయ్య చేయని కామెంట్ ను చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

ఇప్పుడు ఆంధ్ర జ్యోతి తాను చేసిన తప్పేంటో తెలుసుకుంది. శ్రీరాముడు దేవుడు కాదంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో వ్యాఖ్యానించినట్లుగా ఆంధ్రజ్యోతి 13వ పేజీలో ఒక వార్త ప్రచురించింది. అయితే బుధ, శుక్రవారాల్లో ఐలయ్య ఓయూలో ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదని తెలుసుకుని ఈ పొరపాటుకు చింతిస్తున్నామంటూ ఓ స్టైట్ మెంట్ ఇచ్చేసింది. స్లిప్ అవ్వడం ఎందుకు ఇప్పుడిలా వర్రీ అవ్వడం ఎందుకు. బట్ ఏది ఏమైనా తప్పు తెలుసుకుని చెంపలేసుకున్న ఆంధ్రజ్యోతి… రేపన్న రోజు జగన్ లక్ష కోట్ల ఆరోపణల విషయంలో కూడా ఇలాంటి యు టర్న్ తీసుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -