Tuesday, May 7, 2024
- Advertisement -

ఆ మీడియాకు నేరుగా జగన్ వార్నింగ్

- Advertisement -

2014లో చేతులదాక వచ్చిన అధికారం.. జగన్ గెలుస్తాడని అందరూ చెప్పారు. కానీ బాబు వేసిన ఎత్తు.. టీడీపీ అనుకూల మీడియా చేసిన రాద్ధాంతంతో జగన్ కు అధికారం దక్కకుండా పోయింది.

2014 ఎన్నికలవేళ చంద్రబాబు బీజేపీ-జనసేనతో కాళ్లబేరం చేసుకొని పొత్తు పెట్టుకోవడం.. కేంద్రంలో బీజేపీ వచ్చి విభాజిత ఏపీకి న్యాయం జరగాలంటే టీడీపీ గెలవాల్సిందేనని బాబు, ఆయన అనుకూల మీడియా చేసిన రాద్ధాంతం అంతా ఇంతాకాదు.. టీడీపీ మీడియా విష ప్రచారానికి చాలా మంది డైవర్ట్ అయ్యారు. అలా ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. వైసీపీ ఓడింది.

వైఎస్ జగన్ ఓడిపోయాక కూడా గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు, పవన్, టీడీపీ అనుకూల మీడియా ఆయనపై విష ప్రచారం చేస్తూనే ఉంది. కేసులు, అవినీతి విషయాలను తవ్వితీస్తూ అభూత కల్పనలతో నానా యాగి చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసి.. నైతికంగా దెబ్బతీసి ఎంత చేయాలో అంతా చేశారు.టీడీపీ మీడియా దెబ్బకు జగన్ కొన్ని మీడియా సంస్థలను తన ప్రెస్ మీట్లకు, సమావేశాలకు రావద్దంటూ నేరుగానే చెప్పేశారు..

ఇప్పుడు తాజాగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుకు కాపు కాసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు కొత్త ప్రభుత్వంపై విషం కక్కే అవకాశాలున్నాయని.. వీరంతా బాబు నమ్మిన బంటులని.. అందుకే ఏపీలో తాము జ్యూడిషియల్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు జగన్ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో సాగే ఈ కమిషన్ కు ప్రభుత్వ పాలసీలు, తీసుకునే నిర్ణయాలను పంపిస్తామని.. వారి మార్పులు, చేర్పులతోనే పాలన సాగిస్తామని.. ఈవిషయంలో ఎలాంటి రాతలు రాసినా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 లాంటి సంస్థలపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరికలు పంపారు.

ఇలా అధికారంలోకి వచ్చాక టీడీపీ మీడియా చెలరేగి రాసే ప్రమాదమున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం టీడీపీ అనుకూల మీడియాకు షాక్ లా పరిణమించింది. మరి జగన్ నిర్ణయానికి ఈ మూడు సంస్థలు ఎలాంటి కౌంటర్ లు తీసుకుంటాయన్నది వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -