- Advertisement -

మ‌రో జ‌న‌సేన నేత రాస‌లీల‌ల బాగోతం!

- Advertisement -

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రాజకీయ పలుకుబడి అండతో సాగుతున్న ఒక నాయకుడి రాసలీలల బాగోతం బట్టబయలైంది. జనసేన పార్టీకి చెందిన స్థానిక నేత వెంకటరాజుపై ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దారుణానికి సదరు బాలిక సొంత తల్లి కూడా సహకరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

నరసాపురం జనసేన నాయకుడు వెంకటరాజుకు, మోకా లక్ష్మి అనే మహిళతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది. అయితే, సదరు మహిళతోనే కాకుండా.. ఆమెకున్న మైనర్ కూతురిపై కూడా ఈ రాజకీయ నాయకుడు కన్నేశాడు. తనతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ ఆ మైనర్ బాలికపై గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు.

తనకు లొంగకపోతే, తనకున్న పొలిటికల్ పరపతిని, రాజకీయ అండదండలను ఉపయోగించి భవిష్యత్తును నాశనం చేస్తానని సదరు బాలికను వెంకటరాజు భయభ్రాంతులకు గురిచేశాడు.ఈ హేయమైన చర్యలో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం ఏమిటంటే.. ఆ బాలికకు రక్షణగా నిలవాల్సిన కన్నతల్లే కాలయముడిగా మారింది. రాజకీయ నాయకుడు వెంకటరాజుకు లొంగిపోవాలంటూ, అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ ఆ సొంత తల్లి కూతురిని ప్రోత్సహించడం సిగ్గుచేటని స్థానికులు మండిపడుతున్నారు.

తల్లి, ఆ నాయకుడి వేధింపులను తట్టుకోలేకపోయిన ఆ మైనర్ బాలిక చివరకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియా ముందుకు వచ్చి కన్నీరుమున్నీరవుతూ తన ఆవేదనను పంచుకుంది. తన తల్లి, జనసేన నేత వెంకటరాజు కలిసి తన జీవితాన్ని నరకంగా మార్చారని, తనను కాపాడి న్యాయం చేయాలని మీడియా సాక్షిగా వేడుకుంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పొక్సో (POCSO) చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో నరసాపురం రాజకీయాల్లో ఈ ఉదంతం తీవ్ర దుమారం రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -