Thursday, April 25, 2024
- Advertisement -

ఐబీ ఛీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ

- Advertisement -

హైకోర్టు దెబ్బ‌కు టీడీపీ ప్ర‌భుత్వం దిగొచ్చింది. రెండు రోజులుగా ఐబీ చీఫ్ ఏబీ వెంట‌కేశ్వ‌ర‌రావు బ‌దిలీపై నెల‌కొన్న వివాదానికి తెర‌ప‌డింది. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. అయితే ఏబీ వెంట‌కేశ్వ‌ర‌రావును మాత్రం బ‌దిలీ చేయకుండా బాబుస‌ర్కార్ చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నాలు కొన‌సాగించింది.

అయితే హైకోర్టు ఆదేశాల‌తో బాబు స‌ర్కారు దిగిరాలేక త‌ప్ప‌దు. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్‌ 750 జారీ చేసింది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికల విధులను ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించవద్దంటూ జీవోలో పేర్కొంటూ.. హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -