Tuesday, May 14, 2024
- Advertisement -

చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల గార‌డి విద్య‌లు చూడండి…..

- Advertisement -
AP CM Nara Chandrababu Naidu Garadi

పాత రోజుల్లో ఇంట‌ర్నెట్‌, ర‌వాణా సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో ఏదైనా ఒక ప్ర‌దేశం గురించి చెప్తే ఉహించుకొనేవాల్లు. దానికితోడు గార‌డీ విద్య‌లే ప్ర‌జ‌ల‌కు వినోదాలు. ఈ గార‌డిద్వారా ఉన్న‌ది లేనిది….లేనిది ఉన్న‌ట్లు గా చూపించి జ‌నాలుచేత చ‌ప్ప‌ట్లు కొట్టించుకొని వాల్లు ఇచ్చి చిల్ల‌ర‌ను తీసుకుని పొట్ట‌పోసుకొనేవాల్లు.

త‌ర్వాత సినిమారంగం ప్ర‌వేశించింది. అప్ప‌ట్లో సినిమాల‌న్నీ బ్లాక్ అండ్‌వైట్‌లో వ‌చ్చేవి. సినిమాలు చూడాలంటె గ‌గ‌నం.ఇవ‌న్నీ అటుంచితే మ‌న చిన్న‌త‌నంలో డ‌బ్బాలాంటి బాక్స్‌తీసుకొని వ‌చ్చేవారు అవి గుర్తుండే ఉంటుంది.పిలింబాక్స్ ద్వారా సినిమా బొమ్మ‌ల‌తోపాటు…..క‌ల‌క‌త్తా…ముంబాయి…మ‌ద్రాస్ ప‌ట్ట‌నాలు చూడాల‌నుంకుంటున్నారా అయితే మా వ‌ద్ద‌కు రండి బాబు ….రండి అంటూ రంగు రంగుల సిత్రాలు చూపిస్తామంటే అక్క‌డికి ప‌రిగెత్తుకొని వెల్లి అత‌ని ద‌గ్గ‌ర ఉన్న పిలిండ‌బ్బాలో ఆయా న‌గ‌రాల‌ను …సినిమాబొమ్మ‌ల‌ను చూపించి మ‌నం ఇచ్చినేది పుచ్చుకొనే వాల్లు …అదంటె అత‌ని పొట్ట‌కూటికోసం దానిలో ఎంతో కొంత నిజాయితీ ఉంది.

{loadmodule mod_custom,Side Ad 1}

కాని ఇప్పుడుకూడా వాటిని చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.30 సంవ‌త్స‌రాలు హైటెక్ మంత్రిగా పేరున్న ఒక ముఖ్య‌మంత్రి సింగ‌పూర్… బీజింగ్‌….జ‌పాన్ …ఇస్తాంబుల్ చూపిస్తానంటూ ప్ర‌జ‌ల‌కు చెవిలో పువ్వులు పెట్టేస్తున్నారు.ఈ పాటికి ఆయ‌న ఎవ‌రో మీకు అర్థ‌మ‌య్యేఉంటుంది. ఆయ‌నో ఎవ‌రో కాదు మ‌న ఏపీ హైటెక్‌ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఇప్పుడు అస్స‌ల్ క‌థ‌లోకి వ‌ద్దాం..
చంద్ర‌బాబు అధికారంలోకి రాగానే …రాజ‌ధానిని అలా చేస్తా …ఇలా చేస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌జ‌ల‌కు అరచేతిలో స్వ‌ర్గాన్ని చూపించారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఇలా ఉంటాద‌ని రండీ బాబూ …రండి అని రంగురంగుల ర‌జధానిని చూపించారు.

  • ప్ర‌జ‌ల‌కు చెప్పిన మాట‌ల‌లో…
  • రాజధానికి సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన…
  • డ్వాక్రాకు ‘వాల్‌మార్ట్‌’ సొబగులు… కోనసీమ కొబ్బరి నీళ్లకు ‘పెప్పికో’ హంగులు
  • 43వేల కోట్లతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు… రూ.10 వేల కోట్లతో గ్యాస్‌ ఆధారిత ఎరువుల కర్మాగారం..
  • బంగారం రిఫైనరీ కేంద్రం ఏర్పాటుకు ఇండానీ గ్లోబల్‌ ఆసక్తి.. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్‌స్టీల్‌ సంసిద్ధత
  • సింగపూర్, న్యూయార్క్, లండన్, బీజింగ్, టోక్యో…… తరహాలో అమరావతి నిర్మాణం’

{loadmodule mod_custom,Side Ad 2}

విదేశీ పర్యటనలకు ముందు, ముగిసిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలివి. అయితే వీటిలో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. కోట్ల రూపాయల ప్రజాధనంతో గత మూడేళ్లలో 12 సార్లు విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు.. వివిధ కంపెనీలతో లెక్కలేనన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని,లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. అయితే అవి ఎంతవరకూ కార్యరూపం దాల్చాయి అంటే ప్రభుత్వమే సమాధానం చెప్పలేని పరిస్థితి!
1.25 లక్షల మందికి ఉద్యోగాలట…
సీఎం చంద్రబాబు తాజాగా అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించారు. 90కిపైగా కంపెనీల ప్రతినిధులు, పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. డెల్, యాపిల్, సిస్కో, గూగుల్, క్వాల్‌కమ్, మోసెర్, జోహో, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించానని చంద్రబాబు వెల్ల్లడించారు. ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, తద్వారా కనీసం 1.25 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ట్వీటర్‌లో పేర్కొన్నారు.

                                                                                    చంద్రబాబు విదేశీ పర్యటనలు…
సింగపూర్‌కు నాలుగు సార్లు..
2014 నవంబర్‌ 11 నుంచి 14 వరకు సింగపూర్‌లో పర్యటించారు. సీఎంగా చంద్రబాబు తొలి విదేశీ పర్యటన ఇదే. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న 1,691 ఎకరాలను సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అప్పగించేలా ఆ పర్యటనల్లో ‘అవగాహన’ కుదుర్చుకున్నారు.
ప్రపంచ ఆర్థిక సదస్సుకు మూడు సార్లు
2015 జనవరిలో దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డ్వాక్రా ఉత్పత్తులకు వాల్‌మార్ట్‌ సొబగులు, కోనసీమ కొబ్బరి నీళ్లకు పెప్సికో హంగులు, విప్రో సాయంతో డిజిటల్‌ నగరంగా విశాఖ అంటూ ఊదరగొట్టారు. కాని ఇప్ప‌టికీ ఒక్క సంస్థ‌రాలేదు.
జపాన్‌కు రెండు సార్లు
2014 నవంబర్‌ 25 నుంచి 29 వరకు జపాన్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఏపీలో టోక్యో, క్యోటో నగరాలను నిర్మి స్తామని జపాన్‌ కంపెనీలు ప్రకటించాయి.కాని వాటి సంగ‌తే మ‌ర‌చిపోయాయి 2015 జూలై 7 నుంచి 10 వరకు రెండోసారి జపాన్‌లో చంద్రబాబు పర్యటించారు. ఫ్యూజీ ఎలక్ట్రానిక్స్‌. జైకా, సుమితోమో, మిత్సుబి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జపాన్‌కు చెందిన నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

బ్రిటన్ ప‌ర్య‌ట‌న‌
2016 మార్చి 10 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి లండన్‌లో పర్యటించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు లండన్‌లో అమరావతి కార్యాలయాన్ని నెలకొల్పుతామన్నారు. బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనాసుపత్రుల్లో ఒకటైన కింగ్స్‌ కాలేజీ హాస్పిటల్‌ ఏపీ రాజధాని అమరావతిలో తక్షణమే 1,000 పడకల ఆసుపత్రిని నెలకొల్పేందుకు అంగీకరించిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 11 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తుందన్నారు.కాని ఇవేవి కార్య‌రూపం దాల్చ‌లేదు.
చైనా ప‌ర్య‌ట‌న‌
2016 జూన్‌ 26 నుంచి 29 వరకు చైనాలో పర్యటించారు. మొత్తం 29 ఎంఓయూలు చేసుకున్నారు. కృష్ణపట్నంలో రూ. 10,183 కోట్ల పెట్టుబడులతో గ్యాస్‌ ఆధారిత ఎరువుల కర్మాగారం.. ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.43,120 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు… వైఎస్సార్‌ జిల్లాలో రూ.3,000 కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు.ఒక్క‌డ‌గు కూడా ముందుకు ప‌డ‌లేదు.
రష్యా ప‌ర్య‌ట‌న‌..
2016 జూలై 9 నుంచి 14 వరకు రష్యాలో పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి రష్యా, కజికిస్తాన్‌తో రెండు ఎంఓయూలు చేసుకున్నారు.ప్ర‌స్తుతం వాటి ఊసెలేదు.

{loadmodule mod_custom,Side Ad 2}

అమెరికా ప‌ర్య‌ట‌న‌
2017 మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటించారు. ఆపిల్‌ కంపెనీ సీఈఓతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏపీలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారని, అలాగే బెల్‌ హెలికాప్టర్‌ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పాలని చంద్రబాబు కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఎన్ని కంపెనీలు వ‌చ్చాయే అంద‌రికీ తెలిసిందే.కాని బాబు మాత్రం ప్ర‌జ‌ల‌కు గార‌డీ విద్య‌తో రంగురంగుల అమ‌రావ‌తిని చూపిస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -