Wednesday, May 8, 2024
- Advertisement -

టీడీపీ డ్రోన్ డ్రామాకు పుల్ స్టాప్ పెట్టిన డీజీపీ గౌతమ్ సవాంగ్….

- Advertisement -

రెండు మూడు రోజులుగా ఏపీలో డ్రోన్ రాజకీయం రంజుగా నడుస్తోంది. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగడంపై టీడీపీ నేతలో నానాయాగి చేస్తున్నారు. ఏదోవిధంగా చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతి పొంగి పొర్లాలని తెగ కష్టపడుతున్న తెలుగు తమ్ముళ్ల. ప్రతి చిన్న విషయాన్ని పట్టుకొని రాద్దాతం చేస్తున్నారు. చంద్రబాబు అద్దెకు ఉండే ఇంటి మీద డ్రోన్ ఎగిరిన విషయం మీద గడిచిన మూడు రోజులుగా సాగుతున్న రచ్చ కొనసాగుతోంది.

రెండు రోజుల క్రితం వరద ముప్పు తెలుసకొనేందుకు ప్రభుత్వం డ్రోన్ ను వినియోగించింది. దీంతో టీడీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ డీజీపీతో ఫోన్ చేయగా వివరణ ఇచ్చారు. అంతటితో వదలిపెట్టకుండా రచ్చ రచ్చ చేస్తున్నారు. చివరకు బుద్దా వెంకన్న జగన్ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని సెలవిచ్చారు.

టీడీపీ నేతలు చేస్తున్న డ్రోన్ డ్రామా రాజకీయాలకు మరో సారి డీజీపీ గౌతమ్ సవాంగ్ వివన ఇచ్చారు. వరదల కారణంగా అంచనా కోసం ఇరిగేషన్ శాఖ డ్రోన్ ఉపయోగించిందని చెప్పారు. అయితే.. స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవటంతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. ఇకపై ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరని చెప్పారు. ఏపీ డీజీపీ సవాంగ్ వ్యాఖ్యల మీద తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -