Thursday, March 28, 2024
- Advertisement -

ఏపీలో కరోనా కంట్రోల్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

- Advertisement -

ఏపీలో కరోనా కంట్రోల్ పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజురోజుకు ప్రబలుతున్న కేసుల దృష్ట్యా దానిపై ఫుల్ ఫోకస్ పెట్టేందుకు డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆస్పత్రుల పర్యవేక్షణ, వ్యాధి నియంత్రణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ ను జగన్ సర్కార్ నియమించింది.

ప్రస్తుతం వెయిటెంట్ లో ఉన్న 2003 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఏవీ రాజమౌళిని కరోనా స్పెషల్ ఆఫీసర్ గా జగన్ సర్కార్ నియమించింది. ఈయన ఆసుపత్రుల పర్యవేక్షణ, ఎక్స్ ఆఫిషియో సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి ఏపీలో కరోనా నియంత్రణపై ఫోకస్ చేస్తారు.

కరోనాకేర్ సెంటర్స్, క్వారంటైన్ కేర్ సెంటర్స్ సహా ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం.. క్రిటికల్ సిచ్చేవేషన్స్ లో ఈ ఐఏఎస్ ఆఫీసర్ జిల్లాల్లో పర్యటించి కీలకంగా వ్యవహరిస్తారు.

ఇప్పటికే ఏపీలో కరోనా కోరలు చాస్తుండడంతో దాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే సీఎం జగన్ దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ అరికడుతున్నారు. ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఆఫీసర్ ను నియమించి దానిపై ఫుల్ ఫోకస్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -