Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు..కోర్టు నిబంధనలను పాటించాల్సిందే!

- Advertisement -

మధ్యంతర బెయిల్‌పై ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కోర్టు ఉత్తర్వులను పాటించాల్సిందేనని తెలిపింది హైకోర్టు. చంద్రబాబుకు మరిన్ని షరతులు విధించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన న్యాయస్థానం…ఇందుకు నిరాకరించింది. అదే సమయంలో మధ్యంతర బెయిల్ ఇచ్చిన సందర్భంగా సూచించిన నిబంధనలను చంద్రబాబు పాటించాల్సిందేనని తెలిపింది.

మధ్యంతర బెయిల్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించాలరని ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపించారు పొన్నవొలు సుధాకర్. బాబు వెంట ఇద్దరు డీఎస్పీలను ఉండేందుకు అనుమతించాలని, ఇక బెయిల్ తర్వాత టీడీపీ శ్రేణులు తీసిన ర్యాలీకి సంబంధించిన వివరాలను న్యాయస్థానానికి అందజేశారు. బాబు తరపున దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఇది చంద్రబాబు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను తిర‌స్క‌రించింది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయ‌ని స్పష్టం చేసింది న్యాయస్థానం. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలోనే ఆదేశించామ‌ని వాటిని చంద్రబాబు పాటించాల్సిందేనని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -