Saturday, May 4, 2024
- Advertisement -

వాజ్‌పేయి మృతికి సంతాపం ప్ర‌క‌టించిన ప‌లువురు ప్ర‌ముఖులు..

- Advertisement -

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఎయిమ్స్‌లో వెంటిలేట‌ర్‌పై ఉండి చికిత్స పొందిన ఆయ‌న గుర‌వారం సాయంత్రం 5.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతికి ప్ర‌ధానిమోదీతోఆటు ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

వాజ్‌పేయి ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన మృతి ఎంతో బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి : రజనీకాంత్‌.

మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందంటూ ఆయన వాజ్‌పేయికి ఘననివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.

వాజ్‌పేయి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మోదీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -