- Advertisement -

మంత్రుల మధ్య ‘బదిలీల’ రచ్చ

- Advertisement -

అవసరాల మేరకు బదిలీలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మంత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ప్రభుత్వ అవసరాలు కాకుండా మంత్రులు తమ అవసరాలుగా మార్చుకుని బదిలీలకు శ్రీకారం చుట్టారు.

దీంతో వారి మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలు ఈ బదీలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీశాయి. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయం మేరకు జరిగిన ఆర్డీవోల బదిలీలను మంత్రి గంటా అడ్డుకున్నారు. ‘చిన్న బాబు’ సూచనల మేరకు సీఎంవో ఉన్నతాధికారి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనుకూలంగా జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్ల్లు సమాచారం. దీంతో ఓ ఆర్డీవోను విధుల్లో చేర్చుకోవడానికి కలెక్టర్ కార్యాలయం అధికారులు నిరాకరించారు. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సీఎం కార్యాలయం అధికారిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -