భానుప్రియ‌ మాజీ భ‌ర్త మృతి

- Advertisement -

అల‌నాటి సినిమాల్లో అందాలచందాలు, న‌ట‌న‌తో మెప్పించిన భానుప్రియ జీవితంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ కౌశల్ మృతిచెందడంతో ఆమె విషాదంలో మునిగింది. గుండెపోటుతో అమెరికాలో ఆద‌ర్శ కౌశ‌ల్ మృతిచెందిన షాకింగ్ న్యూస్ భానుప్రియ‌కు తెలియ‌డంతో వెంటనే చెన్నైలో ఉంటున్న ఆమె అమెరికాకు ప‌య‌న‌మైంది. మాజీ భ‌ర్త ఏంటి? అనుకుంటున్నారా.. చ‌ద‌వండి.

సినిమాల్లో రాణిస్తున్న స‌మ‌యంలోనే భానుప్రియ 1998లో అమెరికాలో నివసిస్తున్న ఆదర్శ్ కౌశల్‌ను పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు సంసారం బాగా సాగినా త‌ర్వాత 2005లో వాళ్లిద్ద‌రూ విడిపోయారు. వారికి అభినయ అనే కుమార్తె ఉంది. పెళ్లి తరవాత భానుప్రియ అమెరికాలో ఉండిపోగాయిది. విడాకులు తీసుకున్నాక భానుప్రియ తిరిగి కుమార్తెతో చెన్నైలో ఉంటోంది. ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణించాడ‌ని తెలియ‌డంతో అమెరికాకు వెళ్లిపోయింది.

- Advertisement -

భానుప్రియ మంచి మంచి సినిమాల్లో న‌టించి క్లాసిక్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. స్వ‌ర్ణ‌క‌మ‌లం ఆమెకు మైలురాయిలాంటి సినిమా. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -