Sunday, May 5, 2024
- Advertisement -

రాజధానికి ఓ వైపు చలి భయం.. మరో వైపు రైతుల భయం..!

- Advertisement -

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం సంపూర్ణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు సాగే ఈ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘాల సమాఖ్య, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎమ్‌) ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మినహా దేశమంతా రోడ్డు, రైలు, రవాణా సేవలను నిలిపివేస్తామని, మార్కెట్లను స్తంభింపజేస్తామని పేర్కొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ బంద్‌కు పిలుపిచ్చినట్లు ఎస్‌కేఎమ్‌ తెలిపింది.

బంద్‌కు తాము మద్దతివ్వడం లేదని అఖిల భారత వర్తకుల సమాఖ్య ప్రకటించింది.ఢిల్లీ-యూపీ సరిహద్దు ఘజియాబాద్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతల ఆధ్వర్యంలో సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.

సీబీఐ@భారత్ లో 100 దాడులు..!

నేడు భారత్ బంద్.. స్థంభించిన రవాణా వ్యవస్థ!

అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు కన్నుమూత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -