Friday, April 19, 2024
- Advertisement -

మూడేళ్లకు మించి పెండింగ్లో ఉన్న కేసులు రద్దు..!

- Advertisement -

హైకోర్టులు, అనుబంధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మూడేళ్లకు మించి పెండింగ్​లో ఉన్న కేసులను రద్దు చేసేలా జ్యుడిషియల్ ఛార్టర్​ను అమలు చేయాలని పిటిషన్ అభ్యర్థించింది.

బిజేపి నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అన్ని హైకోర్టులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర హోంశాఖ, కేంద్ర న్యాయ శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం శీతాకాల సెలవుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కోర్టుల్లో విచారణ ఆలస్యం కావడం ఆర్టికల్ 21కి విరుద్ధమని పిటిషన్​దారు పేర్కొన్నారు. సత్వర న్యాయం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, దాన్ని అణచివేయకూడదని వ్యాఖ్యానించారు.పెండింగ్ కేసులను మూడేళ్లలోగా రద్దు చేయాలని 2009 అక్టోబర్ 25నాటి జ్యుడిషియల్ ఛార్టర్ స్పష్టం చేస్తోందని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. నిందితుడి గౌరవాన్ని నిలబెట్టేందుకు విచారణ త్వరగా ముగించడం అవసరమని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -