Friday, April 26, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ప‌నిచేసేందుకు ఆస‌క్తి చూపుతున్న సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌..

- Advertisement -
CBI JD Lakshmi Narayana is coming back to telugu states

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ గురించి తెలియ‌ని వారుండ‌రు.అయ‌నో సంచ‌ల‌నం.వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌ను విచారించిన స‌మ‌యంలో ఆయ‌న హోరోనే.ఆ సమయంలో ఆయనకు కనివిని ఎరుగని పబ్లిసిటీనే వచ్చింది.

జగన్‌ను విలన్‌ చేయాలంటే లక్ష్మీనారాయణను హీరోగా చూపించాలన్న భావనతో టీడీపీ అనుకూల మీడియా ఓ రేంజ్‌లో ఆయనకు పబ్లిసిటీ ఇచ్చిందన్న విమర్శలు ఉన్నాయి.అప్పట్లో లక్ష్మీనారాయణ ఒక క్రేజ్ ఉండేది. జగన్ కేసులో వరుస అరెస్టులు.. విచారణలు అన్నీ సంచలనంగా మారాయి అప్పట్లో. అయితే ఇప్పుడు మ‌ల్లీ తెలుగు రాష్ట్రాల‌కు రావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.
ఆ మధ్య లక్ష్మీనారాయణ పనితీరును ఇష్టపడ్డ చంద్రబాబునాయుడు… ఏపీకి తీసుకొచ్చి అమరావతి కమిషనరేట్‌కు కమిషనర్‌గా నియమిస్తారని వార్తలొచ్చాయి. కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చేందుకు లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

వాస్తవానికి లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. డిప్యుటేషన్ పై సీబీఐ జేడీగా ఉమ్మడి ఏపీలో సేవలు అందించారు. జగన్ కేసుల విచారణ తర్వాత డిప్యుటేషన్‌ పూర్తికావడంతో ఆయన తిరిగి మహారాష్ట్ర క్యాడర్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ హైదరాబాద్‌ రావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ప్రస్తుతం లక్ష్మీనారాయణ పుణేలో అదనపు డీజీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఆయన తెలంగాణలో పనిచేసేందుకు ఇష్టపడుతుండడం విశేషం. ఈ విషయమై ఆయన తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మను కలిసి చర్చించినట్టు చెబుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే డిప్యూటేషన్‌పై ఆయన ఇక్కడకు రావాలని ఆశిస్తున్నారు.
సీబీఐ జేడీగా ఉన్న సమయంలో కొన్ని పార్టీలకు, కొన్ని మీడియా సంస్థలకు అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఆయన మీద వచ్చాయి.

{loadmodule mod_custom,Side Ad 2}

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలూ అంగీకరిస్తే ఆయన మళ్లీ డిప్యుటేషన్‌పై ఇక్కడకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. జగన్ పై సీబీఐ కేసులు ఇంకా విచారణ జరుగుతూనే ఉన్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ రాక వెనుక ఏదైనా వ్యూహం ఉండి ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐతే.. మళ్లీ ఆయన సీబీఐకి కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగానికి వస్తే ఆ ప్రభావం కేసుల విచారణపై ఉండే అవకాశం లేదు.మ‌రి చూడాలి ఏంజ‌రుగుతుందో.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -