కేంద్రంలో నవ్వుల పాలవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు..?

- Advertisement -

అన్నదమ్ముల్లా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత ప్రయత్నిస్తున్నా అస్సలు కుదరట్లేదు.. విడిపోయి సొంత కాపురం పెట్టుకుంటామని తెలంగాణ ఎంత అరిచినా ఉమ్మడి కుటుంబం గా ఉండాలని ఏపీ రాష్ట్రం అప్పట్లో గట్టిగా వాదించింది.. అయితే ఆ విషయంలో తెలంగాణ నెగ్గి వేరే ఇంటిని నిర్మించుకుని జీవనం కొనసాగిస్తోంది.. ఇంటి యజమానులైన కేసీఆర్, జగన్ లు అయినా తెలుగు రాష్ట్రాల మధ్య మంచి స్నేహం ఉండేలా చూసుకుంటారని అనుకున్నారు.. మొదట్లో మైత్రి బాగానే ఉన్నా ఆ తర్వాత జలవివాదం ఇద్దరి మధ్య దూరం పెంచింది..

ఇక అప్పటినుంచి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎడ్డం  అంటే తెడ్డం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. మొదట్లో ఒకే మాట మీద ఉండడానికి ప్రయత్నించిన వీరు ఇప్పుడు ఒకరి మాట ఒకరు వినడం మానేశారని అంటున్నారు.. అయితే కేంద్రం మీద రాష్ర ప్రయోజనాలకు సంభందించి ఎలాంటి అవసరం వచ్చిన ఇరు రాష్ట్రాలు ఒక్కటవ్వాలని అనుకున్నారు.. అయితే ఇప్పుడు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తూ వేరు వేరు గా పంచాయితీలను కేంద్రానికి తీసుకెళ్తున్నారట..

ప్రస్తుతం ఢిల్లీ లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీ ల నేతలు తమ ఎజెండా ను చెప్పే విషయంలో ఒకరితో ఒకరికి పొంతన లేకుండా పోతుందట.. ఒకరు రాష్ట్రం కోసం పోరాడుతూటే మరొకరు కోర్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పార్లమెంట్ సమావేశాల్ని ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో రెండు రాష్ట్రాల ఎంపీలు ధర్నాలు చేశారు. అయితే ఒకే అంశంపై కాదు. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన బకాయిల కోసం నిరసన చేపట్టారు. ఏపీ ఎంపీలు మాత్రం అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని.. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాల కోరుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల దృష్టిలో ఇరు రాష్ట్రాలు కొంత చిన్నబోయినట్లు అనిపిస్తుంది..

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -