Monday, May 13, 2024
- Advertisement -

ఒక రోజు దీక్ష చేయ‌నున్న చంద్ర‌బాబు

- Advertisement -

రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తన పుట్టినరోజైన ఈ నెల 20న నిరాహార దీక్ష ఆయ‌న చేయ‌నున్నారు. గుంటూరు జిల్లాలోని శాఖమూరులో రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించబోయే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని ఆయన జయంతి సందర్భంగా నేడు చంద్రబాబు ఆవిష్కరించారు.

భవిష్యత్తులో ఢిల్లీని శాసించేది టీడీపీయేనని, కేంద్రంలో చక్రం తిప్పేది మేమేనని మ‌రో సారి అన్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర మాది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మేం మద్దతు ఇచ్చే వ్యక్తే ఉంటారు. తమిళనాడులో కుట్ర రాజకీయాలు చేయాలని బీజేపీ చూసింది. కానీ అక్కడ వారి ఆటలు సాగలేదు. ఏపీలో ఒక అవినీతిపరుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఏపీలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. దేశ వ్యాప్తంగా నాకంటూ ఒక ఇమేజ్ ఉంది. అవినీతిపరుడైన జగన్‌తో కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే జగన్.. కేసుల మాఫీకోసం బీజేపీ చెప్పినట్లు వింటున్నారు’ అని కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

గుజరాత్‌లో మోదీ దొలెరా లాంటి సిటీని నిర్మిస్తున్నారని, మరి అలాంటప్పుడు ఏపీలో మాకు రాజధాని వద్దా అని సీఎం ప్రశ్నించారు. ముసుగువీరుల ముసుగులు తొలగిస్తే అసలు రూపం బయటికొస్తుందని, మోదీపై పోరాటం చేస్తున్న తనకు ప్రజలు మద్దతివ్వాలని చంద్రబాబు కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -