Friday, May 3, 2024
- Advertisement -

వివిధ రంగాల్లో భారత్‌ సాధిస్తున్న ప్రగతి చైనాకి నిద్ర ప‌ట్ట‌డంలేదు…

- Advertisement -

భారత్ – చైనా మధ్య డోక్లాం వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇరుదేశాల మధ్య ఇన్ని రోజులు మాటల యుద్ధం జరుగగా.. తాజాగా భారత్ పై స్వల్పస్థాయి యుద్ధానికి చైనా వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.భారత్‌పై దండెత్తాలని ఉవ్విళ్ళూరుతోంది. భార‌త్ సౌనిక‌,ఆయుధాలు,ఆర్థిక‌వ్య‌వ‌స్త‌ల ప‌రంగా చైనాతో స‌రితూగ‌లేద‌నెది నిజం.

అలాగ‌ని భారత్‌ని చైనా తక్కువ అంచనా వేస్తే, అంతకన్నా మూర్ఖ‌త్వం ఇంకోటుండదు. డోక్లామ్‌ దగ్గర మొదలైన ఈ వివాదం, చైనా – భారత్‌ సరిహద్దు కలిగి వున్న చాలా ప్రాంతాలకు పాకింది. అయితే, ఇంతవరకు ఇరు దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఒక్క ‘తూటా’ కూడా పేలిన దాఖలాలు లేకపోవడం ఆశ్చర్యకరం.

ఇప్పటిదాకా పాకిస్థాన్ తెరవెనకాల వున్న చైనా, ఇప్పుడు బహిరంగంగా భారత్‌తో యుద్ధానికి తలపడేందుకు సిద్ధమవుతోంది. ‘చిన్నపాటి సైనిక చర్యకు సమాయత్తం’ అంటూ చైనా, సంకేతాలు పంపుతున్న వేళ, భారత్‌ ఏమాత్రం ఉలిక్కిపడటంలేదు. ఎందుకంటే, యుద్ధం వస్తే ఏమవుతుందో భారత్‌కీ తెలుసు, చైనాకీ తెలుసు.

తూటా పేలడమంటూ జరిగితే, ఆ తర్వాత అది చిన్న యుద్ధం అనడానికి వీల్లేని పరిస్థితులు దాపురించేస్తాయి. ఉత్తర కొరియా, అమెరికాని కవ్విస్తోందంతే. అమెరికా – రష్యా మధ్య ‘మాటల యుద్ధమే’ జరుగుతుంటుంది. ఎందుకు.? యుద్ధ పర్యవసానాలు అందరికీ తెలుసు గనుక. ప్రపంచంలో నిత్యం ఏం జరుగుతుందో చైనా తెలుసుకోకుండా వుంటుందా.? యుద్ధం వస్తే ఏం జరుగుతుందో చైనాకి బాగా తెలుసు.

సరిహద్దుల్లో ‘డోక్లామ్‌’ తరహాలోనే యుష్టియుద్ధాలకు తెగబడటం, సైనిక బలగాల్ని ఇంకాస్త ఎక్కువగా మోహరించడం, ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం.. ఇంతకు మించి చైనా ఇంకేమీ చేయలేదన్నది నిర్వివాదాంశం. వివిధ రంగాల్లో భారత్‌ సాధిస్తున్న ప్రగతి చైనాకి నిద్ర‌లేకుండా చేస్తోంది.యుద్ధం వస్తే భారత్‌ నష్టపోవడం ఖాయం. అంతకన్నా ఎక్కవగానే ఛైనా కూడా నష్టపోవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -