Monday, April 29, 2024
- Advertisement -

జగన్ తో చర్చ.. వైసీపీలోకి మెగాస్టార్..?

- Advertisement -
Chiranjeevi Joining Ysrcp

ప్ర‌ముఖ హీరో.. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి.. ఇక కాంగ్రెస్ ను పక్కన పెట్టినట్లు ఏపీలో రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. . ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరు.. ఆ తర్వాత రాజ్య సభకు ఎంపీగా ఎన్నికై.. ఆ తర్వాత కేంద్రమంత్రిగా పని చేసిన చిరు.. కొంత కాలం నుంచి కాంగ్రెస్ ను దూరంపెడుతున్నట్లు తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1}

రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ.. గుంటూరిలో.. ప్ర‌త్యేక హోదా పేరుతో బ‌హిరంగ స‌భ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించింది. ఈ బ‌హిరంగ స‌భకు రాహుల్‌గాంధీతో పాటు జాతీయ‌స్థాయి నేత‌లు అయిన ప్రతి ఒక్కరు హాజరయ్యారు. ఇంతమంది వచ్చినా.. చిరు మాత్రం ఇక్క‌డ‌కు రాక‌పోవ‌డంతో ఆయ‌నకు కాంగ్రెస్‌లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేదంటున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌కు రాహుల్‌ను ఆహ్వానించేందుకు ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ వెళ్లినా చిరు మాత్రం వెళ్లలేదు. ఆ తర్వాత చిరు.. సభకు వస్తారని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పిన.. ఆయన రాలేదు. దీంతో చిరు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే కాంగ్రెస్ వాళ్లు మాత్రం చిరు విదేశీ టూర్‌లో ఉండ‌డంతోనే రాలేక‌పోయార‌ని క‌వ‌ర్ చేస్తున్నారు.

{loadmodule mod_custom,GA2}

ఇది ఇలా ఉంటే.. చిరు ఇటీవ‌లే వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను న్యూజీలాండ్‌లో భేటీ అయిన‌ట్టు సమాచారం. తాను వైసీపీలో చేరితే త‌న‌కు ల‌భించే ప్ర‌యారిటీ అంశంపై జ‌గ‌న్‌-చిరు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగా ఎప్పుడైనా చిరు వైసీపీలో చేర‌తార‌ని..ఆయ‌న‌కు జ‌గ‌న్ మ‌రోసారి రాజ్య‌స‌భ రెన్యువ‌ల్‌పై హామీ ఇచ్చార‌న్న టాక్ కూడా ఇంట‌ర్న‌ల్‌గా వినిపిస్తోంది. ఏది ఏమైన.. చిరు మాత్రం.. కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. 

{youtube}7j0oi6mcDXw{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జగన్‌తో భేటీ.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
  2. సినీ పరిశ్రమకు తీరని లోటు.. వైఎస్‌ జగన్‌ సంతాపం..
  3. 2019లో ఈ ఐదు సంతకాలతో.. కొత్త చరిత్ర సృష్టించనున్న జగన్
  4. అభిమానులంటే జగన్‌ కి ప్రాణం.. ఇది చదివితే మీరు కూడా అభిమానులు అవ్వడం ఖాయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -