Monday, May 13, 2024
- Advertisement -

తొలిసారి సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్..

- Advertisement -

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. సీఎం హోదాలో తొలిసారిగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం ఓపెన్ టాప్ పై అధికారులకు, ప్రజలకు అభివాదం చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా రరాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడులకలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శాసనమండలి ఆవరణలో మండలి చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ తమ్మినేని సీతారాం మువన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో షరీఫ్, తమ్మినేని సీతారాం మొక్కలు నాటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -