Sunday, May 5, 2024
- Advertisement -

మ్యానిఫెస్టోను విడుద‌ళ చేసిన కాంగ్రెస్‌.. మ్యానిఫెస్టోలో ఏపీకీ ప్ర‌త్యేక‌హోదా

- Advertisement -

తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచింది. త‌మ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను విడుద‌ళ చేసింది. పేద వ‌ర్గాల‌ను దృస్టిలో పెట్టుకొని ఈ మ్యానిఫెస్టోను రూపొందింది.ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం (ఏప్రిల్ 2) మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే… నిరు పేదలందల కుటుంబాలకు నెలకు రూ.6000 చొప్పున ఏడాదికి రూ.72,000 వేల కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ప్రకటించింది. దీంతో పాటు న్యూతమ్ ఆయ్ యోజన (న్యాయ్‌) లేదా కనీస ఆదాయ పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశంలో పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నామని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. న్యాయ్ పథకాన్ని కచ్చితంగా అమలు చేసి చూపిస్తామక‌ని రాహుల్ తెలిపారు.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీ ఇచ్చిన ప్ర‌త్యేకహోదా హామీని త‌మ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించారు. హస్తం గుర్తును సూచించేలా మేనిఫెస్టోలో ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కామ్-ధామ్, షాన్, సుశాసన్, స్వాభిమాన్, సమ్మాన్ ప్రధానాంశాలుగా మేనిఫెస్టో రూపొందించారు. ఈ కార్యమంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -