ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

- Advertisement -

చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న పార్టీలో కొత్త చైతన్యం నింపేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఎన్టీయే ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపేలా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవసంకల్ప చింతన శిబిరం ముగింపు కార్యక్రమంలో సోనియా తన ప్రణాళికలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా మహా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర పేరు పాదయాత్ర చేపట్టబోతున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. సీనియర్లు సహా నేతలంతా ఈ పాద్రయాత్రలో పాల్గొనాలని సోనియా పిలుపునిచ్చారు.

- Advertisement -

కాంగ్రెస్ మళ్లీ పుంజుకునేందుకు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలను సోనియా గాంధీ సంకల్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నవ సంకల్ప చంతన్ శిబిరం ముగింపు సభలో సంకేతాలిచ్చారు. సోనియా నిర్ణయం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది.

థాంక్యూ చెప్పబోతున్న నాగచైతన్య

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -