Thursday, April 18, 2024
- Advertisement -

కాంగ్రెస్ కు దురమౌతున్న గాంధీ కుటుంబం !

- Advertisement -

కాంగ్రెస్ అంటేనే నెహ్రూ కుటుంబం.. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి భారత స్వాతంత్ర్యోద్యమం మొదలు కొని నెహ్రూ కుటుంబం నాయకత్వం వహిస్తూ వస్తోంది. పార్టీ ప్రారంభంలో జవాహర్లాల్ నెహ్రూ.. ఆ తరువాత ఆయన కుమార్తె ఇందిరా గాంధీ పార్టీకి నాయకత్వం వహిస్తూ వచ్చారు. ఇక ఇందిరా గాంధీ తరువాత రాజీవ్ గాంధీ అధ్యక్షత వహించగా.. ఆయన తరువాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి పార్టీని ముందుండి నడిపించారు. అయితే కాంగ్రెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే 2014 ముందు.. 2014 తరువాత అని చెప్పుకోవాలి..

అంతకు ముందు జాతీయ పార్టీ హోదాలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసిన తరువాత ఇప్పటివరకు కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉందంటే ఆ పార్టీ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 2014 ఎన్నికల తరువాత పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకత్వం కొరవడడంతో 2019 ఎన్నికల్లో కూడా చతికిల పడింది. అయితే సోనియా గాంధీ నాయకత్వం పార్టీకి ప్రధాన బలమే అయినప్పటికి ఇతర పార్టీల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే వాక్చాతుర్యం ఆమె ప్రదర్శించకపోవడం పెద్ద మైనస్..

ఇక యువ నేతగా పార్టీలో మంచి మన్ననలు పొందిన రాహుల్ గాంధీ తదుపరి పార్టీ అధ్యక్షుడు అని గట్టిగా నమ్మే కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉన్నాడు. గతంలో పార్టీ అధ్యక్ష హోదాలో కొనసాగి ఊహించని రీతిలో ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో పార్టీని నడిపించే స్థిరమైన నాయకత్వం కోసం కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఈ నెలాఖరు లోగా ఎన్నుకోవాల్సి ఉండగా.. మరోసారి అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు సోనియా గాంధీ కూడా విముఖత చూపుతున్నారట. ఇకపోతే ప్రియాంక గాంధీ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికి ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు చాలా తక్కువ.. మరి ఇలా వరుసగా నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ అద్యక్షత కు దూర మవుతుండడంతో ఆ పార్టీకి దిక్కెవరు అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి.

Also Read :మోడీ మోనార్క్ వైఖరి ప్రదర్శిస్తున్నాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -