Monday, April 29, 2024
- Advertisement -

బీసీలకు చాలా చేశాం.. మా మేనిఫెస్టో ఆత్మ వాళ్లే !

- Advertisement -

ఏపీ సి‌ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎలాంటి వ్యూహాలు రచించిన రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే ఎన్నికల్లో గెలవాలంటే అత్యంత కీలకమైన బీసీ సామాజిక వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి గత కొన్ని రోజులుగా బీసీలకు సంబంధించిన ప్రస్తావనను పదే పదే తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక తాజాగా విజయవాడలో డిసెంబర్ 7న ( నేడు) జయహో మహాసభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. ఈ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరు అయ్యారు. కాగా సభలో సి‌ఎం జగన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గడిచిన మూడున్నర సంవత్సరాలలో కేవలం బీసీల కొరకే రూ.1.63 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. .

తన పాదయాత్రలో బీసీల కష్టాలు చూశానని.. అందుకో మన ప్రభుత్వం బీసీలను అన్నీ విధాలుగా ఆదుకుంటున్నట్లు సి‌ఎం జగన్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయంలో చంద్రబాబు 114 వాగ్దానాలు ఇచ్చి అందులో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదని విమర్శించారు సి‌ఎం జగన్. దేశ సంస్కృతిలో బీసీలది ఉన్నతమైన చరిత్ర అని దేశ నాగరికత కు బీసీలు పట్టుకొమ్మలు అని పొగడ్తల వర్షం కురిపించారు. ఇక బీసీలకు చెప్పుకోవడానికి గతంలో చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదని, కానీ మన ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారికి అధిక ప్రాధాన్యం కల్పించమని జగన్ చెప్పుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే వైసీపీ మేనిఫెస్టో కు ఆత్మ లాంటి వారని జగన్ చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అని, 2024 లో మంచికి చెడుకు మద్య జరగబోతున్న యుద్దం అని సి‌ఎం జగన్ వ్యాఖ్యానించారు. మొత్తానికి జయహో బీసీ మహాసభలో వైసీపీ నేతలు జగన్ పై భజన చేయగా.. సి‌ఎం జగనేమో బీసీలపై భజన చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ డుమ్మా కొట్టడానికి కారణం అదే !

పవన్ కోసం బాబు కాంప్రమైజ్ కావాల్సిందే..!

ఆంధ్ర మంత్రికి తెలంగాణ మంత్రికి తేడా అదే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -