- Advertisement -

దనియాల కషాయం..ఉపయోగాలు తెలుసా!

- Advertisement -

మన వంటింట్లో తరచూ ఉపయోగించే మసాలా దినుసులలో దనియాలు ఒక ముఖ్యమైనవి. ఏ కూరలోనైనా దనియాల పొడి వేస్తే ఆ వంటకానికి ప్రత్యేకమైన రుచి, గుమగుమలాడే సువాసన వస్తుంది. అందుకే దాదాపు అన్ని కూరలు, కూరగాయ వంటకాలలో దనియాల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. అయితే దనియాలు కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఆయుర్వేద వైద్యంలో కూడా దనియాల పొడిని, దనియాల కషాయాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.

కొత్తిమీర గింజల రూపంలో ఉండే దనియాలలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిలో విటమిన్ A, విటమిన్ K, విటమిన్ Cతో పాటు ఫోలిక్ యాసిడ్, ఫైటో న్యూట్రియెంట్స్, ఫీనాలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరంలోని పలు ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దనియాలను కషాయం రూపంలో తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

దనియాల కషాయం తయారీ చాలా సులభం. ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ దనియాలు వేసి బాగా మరిగించి, ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే రక్తంలోని షుగర్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని చెబుతున్నారు. అలాగే దనియాలలో ఉండే విటమిన్ C కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇంకా ప్రతిరోజూ దనియాల కషాయం తాగడం వల్ల శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది. జలుబు, దగ్గు, అలసట వంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి. దనియాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి. దనియాల కషాయంలో కొద్దిగా బెల్లం, పాలు కలిపి తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే తేనె కలిపి తాగితే తలనొప్పి, వాతం వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

అయితే అన్ని ప్రయోజనాల కోసం ప్రతిరోజూ కాకుండా వారానికి రెండు లేదా మూడు సార్లు దనియాల కషాయం తాగితే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మితంగా తీసుకుంటే దనియాలు ఆరోగ్యానికి నిజంగా వరంగా మారుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -