Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.!

- Advertisement -

తెలంగాణ లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ ఏడాదిలో తొలిసారి అత్యధికంగా 518 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి తాజాగా ముగ్గురు మృతి చెందారు. గతేడాది నవంబర్​లో రాష్ట్రంలో 502 మందికి వైరస్ సోకింది. ఏడాది క్రితం నమోదైన కేసులతో పోల్చితే వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.

కరోనా నుంచి మరో 204 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 3,995 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 1,767 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. తాజాగా మరో 157 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం 57 వేల 548 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.

భారత్​లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 59 వేల మందికిపైగా కొవిడ్​ బారిన పడ్డారు. మరో 257 మంది చనిపోయారు. 32 వేల మంది కోలుకున్నారు. ఈ ఏడాదిలో ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం.

రాజధానికి ఓ వైపు చలి భయం.. మరో వైపు రైతుల భయం..!

కరోనా కలకలం.. ఒకే కుటుంబలో 21 మందికి కోవిడ్ పాజిటీవ్!

బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ!

సీబీఐ@భారత్ లో 100 దాడులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -