Tuesday, May 14, 2024
- Advertisement -

సానియా ఆ ప్ర‌క‌ట‌న‌నుంచి త‌ప్పుకో …సానియా మీర్జాకు సీఎస్ఈ అల్టిమేటం

- Advertisement -

పౌల్ట్రీ అడ్వర్టైజ్ మెంట్ నుంచి వెంటనే తప్పుకోవాలనంటూ టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) అల్టిమేటం జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఓ పౌల్ట్రీ అడ్వర్‌టైజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని పబ్లిగ్గా చెప్పాలని టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కోరింది.

కోడిమాంసం ఉత్పత్తులలో యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయంటూ 2014లో సీఎస్ఈ ఇచ్చిన నివేదికను అపహాస్యం చేసేలా అడ్వర్టైజ్ మెంట్ ఉందని సీఎస్ఈ అధికారి తెలిపారు. ఒక రోల్ మోడల్ గా ఇలాంటి ప్రకటనల్లో సానియా నటించడం మంచిది కాదని చెప్పారు. వెంటనే ఈ యాడ్ నుంచి ఆమె తప్పుకోవాలని, లేదా అడ్వర్టైజ్ మెంట్ ను కొత్తగా రూపొందించాలని డిమాండ్ చేశారు.

తాము యాంటీ బయాటిక్స్‌ను దుర్వినియోగం చేయడం లేదని ఆ యాడ్ చెప్పడం అబద్ధమని సీఎస్‌ఈ స్పష్టంచేసింది. 2014లో జరిపిన పరీక్షల్లో చికెన్‌లో యాంటీ బయాటిక్స్ అవశేషాలను సీఎస్‌ఈ గుర్తించింది. ఈ యాడ్‌ను మార్చడమో పూర్తిగా తొలగించడమో చేయాలని అడ్వర్‌టైజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆలిండియా పౌల్ట్రీ డెవలప్‌మెంట్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌ను ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -