Sunday, May 5, 2024
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏపీకీ ప్ర‌త్యేక‌హోదా..సీడ‌బ్యూసీలో కాంగ్రెస్ నిర్ణ‌యం

- Advertisement -

రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించి ప‌త‌న‌మైన కాంగ్రెస్ పూర్వ‌వైభ‌వం కోసం నానా తంటాలు ప‌డుతోంది. విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక‌హోదానీ బిల్లులో పెట్ట‌కుండా అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక‌హోదా ఐదు సంవ‌త్స‌రాలు కాదు ప‌ది సంవ‌త్స‌రాలు ఇవ్వాల‌ని అదే స‌మ‌యంలో డిమాండ్ చేసిన భాజాపా త‌రువాత ఎలా మొండి చేయి చూపించిందో అంద‌రికి తెలిసిందే.

అదే ప్ర‌త్యేక హోదాను ఆయుధంగా చేసుకొని ఏపీలో కాంగ్రెస్ ఉనికిని చాటు కొనే దానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. కాంగ్రెస్ అధ్య‌క్షుడుగా రాహుల్ బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత సీడ‌బ్యూసీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఏపీకీ ప్ర‌త్యేక హోదాతోపాటు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకొస్తే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని సీడ‌బ్యూసీలో నిర్ణయింయింది. ఎటువంటి అడ్డంకులున్నా ఏపీకి ప్రత్యేకహోదా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం గతానికి, భవిష్యత్తుకు వారధిగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల గొంతుకు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాహుల్ అన్నారు.

అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటనను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని, ఏపీకి ప్రత్యేక హోదాకు మిగిలిన రాష్ట్రాల డిమాండ్లకు ఏమాత్రం పోలిక లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపు నిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -