Sunday, May 5, 2024
- Advertisement -

విలాస‌వంత‌మైన జీవితం.. చివ‌రికి జైలు

- Advertisement -

తాను దైవ‌దూత‌గా, రాక్ స్టార్ బాబాగా పేరుతెచ్చుకున్న మానవ మృగం గుర్మీత్ రాం రహీమ్ సింగ్ ఇప్పుడు జైలు ఊస‌లు లెక్క‌పెడుత‌న్నాడు. త‌న వ‌ద్ద శిశ్యురాల్లుగా ఉన్న ఇద్ద‌రు సాద్వినిల‌పై ఆయ‌న అత్యాచారం చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు రుజువు కాండంతో డేరా బాబాకు సీబీఐ కోర్టు 20 సంవ‌త్స‌రాలు జైలుశిక్ష‌ను విధించింది.

హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ల‌క్ష‌లాది మంది డేరాకులంగా చెప్పుకొనె ల‌క్ష‌లాది మందికి అత‌ను ఆరాధ్యుడు. విలాస‌వంత‌మైన జీవితం, జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ, ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్లు, క‌ళ్లు జిగేల్‌మ‌నె రంగురంగుల దుస్తులు…ఆయ‌న‌కు సేవ‌లు చేసేందుకూ అంద‌మైన అమ్మాయిలు ఇలా విలాస‌వంత మైన జీవితం గ‌డిపిన డేరా బాబుకు చివ‌రికి ఊచ‌లు లెక్కెట్టాల్సి వ‌చ్చింది.

జైల్లో మొద‌టి రోజు సాదార‌న ఖైదీగా తొలి రాత్రి గ‌డిపారు. సోమవారం రాత్రి ఆయన నిద్రలేని రాత్రిని గడిపారని, తెల్లవారుజామున ఎప్పుడో ఆయన కాసేపు నిద్ర పోయారని జైలు వర్గాలు తెలిపాయి. ఆయనకు సాధారణ ఖైదీలకు ఇచ్చినట్టే రెండు బెడ్ షీట్లు, ఓ ప్లేటు, గ్లాసు ఇచ్చామని, ఆయనతో పాటు జైలుకు తెచ్చుకున్న ఎరుపు రంగు సూట్ కేసును వెనక్కు పంపించామని తెలిపారు.

వాటితో పాటు రెండు జ‌త‌ల దుస్తులు …జైలు అధికారులు అందించారు. తాను కొంచెం అసౌకర్యంతో ఉన్నట్టు గుర్మీత్ తెలిపాడని, బయటి మందులుకానీ, ఆహారం కానీ ఆయనకు అందలేదని అధికారులు తెలిపారు. సాధార‌న ఖైదీల‌లాగ‌నె వారానికి ఒక రోజు ఒక‌రితో ములాఖ‌త్, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప‌ని కేటాయిస్తామ‌ని జైలు అధికారులు తెలిపారు. విలాస‌వంత మైన జీవితం గ‌డిపిన డేరా బాబా చివ‌రికి జైలులో చిప్ప‌కూడు తినాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -