అర్ధరాత్రి పేలుడు.. శివమొగ్గ లో ఆర్తనాదాలు..!

- Advertisement -

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్​ తెలిపారు. మైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రాత్రి 10.30 గంటల సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ వార్త శివమొగ్గలోనే కాకుండా, పొరుగున ఉన్న చిక్కమంగలూరు, దావన్​గెరె జిల్లాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -

పేలుడు ధాటికి పలు ఇళ్లలో కిటికీలు ధ్వంసమవగా, రోడ్లకు బీటలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే తొలుత అందరూ భూకంపంగా భావించగా తర్వాత పేలుడు జరిగిందని తెలిసింది. ఘటనాస్థలంలో పేలుడు ధాటికి శరీరాలు గుర్తుపట్టలేని రీతిలో ఛిద్రమైపోయాయి.

గవర్నర్ దగ్గిరకి నిమ్మగడ్డ.. 

చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీలత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News