నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందె ఇరు పార్టీలు పోలాపోటీగా తలపడుతున్నాయి. ముందు టీడీపీ కొంత దూకుడు కనిపించినా తర్వాత తగ్గింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడతో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభ తర్వాత అధికారపార్టీలో నిరాశ మొదలయ్యింది.
ఇప్పటికే వైసీపీ అధికార టీడీపీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియేగానికి పాల్పడుతోందని ఈసీకి పిర్యాదు చేసింది. దీంతో ఈసీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ కఠినంగా వ్యవహరిస్తుండడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది.ఉప ఎన్నిక అనివార్యమని తేలిన తర్వాత కొత్తగా 16 వేల కొత్త ఓట్లు వచ్చి చేరాయి. ఒకే ఇంటర్‌నెట్ సెంటర్ నుంచి ఏకంగా 4500 ఓట్ల ధరఖాస్తులను అప్‌లోడ్ చేశారు.
భారీగా దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించి ఈసీ వాటిని వేరిపారేసి పని మొదలుపెట్టింది. ఇప్పటికే నాలుగువేలకు పైగా దొంగ ఓట్లను గుర్తించింది. అయితే ఈసీ అంతటిలో ఆగలేదు. పాత ఫిర్యాదులకు దుమ్ముదులిపింది. ఈ సమయంలో గతంలో భూమానాగిరెడ్డి వైసీపీలో ఉండగా చేసిన ఫిర్యాదు కూడా తెరపైకి వచ్చింది.
అప్పట్లో భూమా వైసీపీలో ఉండగా… టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కోవెలకుంట్ల, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన వారిని భారీగా నంద్యాలలో ఓటర్లుగా టీడీపీ నేతలు చేర్చించారని అప్పట్లో భూమా నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే దాన్ని ఎవరు పట్టించుకోలేదు.
టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్చారంటూ భూమా ఇచ్చిన ఫిర్యాదుపైనా దర్యాప్తు చేస్తున్నారు. భూమా ఫిర్యాదు ఆధారంగా దొంగ ఓట్లను గుర్తించి ఏరివేసే పనికి ఈసీ శ్రీకారం చుట్టడంతోపాటు గతంలోనే చేర్చిన దొంగ ఓట్లకు ముప్పు వస్తుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా చివరికి టీడీపీనె మూల్యం చెల్లించుకుంటోంది.
