Thursday, April 25, 2024
- Advertisement -

ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీకి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స

- Advertisement -

ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి త్వ‌ర‌లో మూత్ర‌పిండాల శ‌స్త్ర‌చికిత్స చేయ‌నున్నారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారని మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు మంత్రి జైట్లీని బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. కాగా, సోమవారం నుంచి ఆయన కార్యాలయానికి రావడం లేదు. యూపీ నుంచి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన క్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ హాజరు కాలేదు.

జైట్లీకి శస్త్రచికిత్స ఎయిమ్స్ లో చేయకపోతే సింగపూర్ లో చేసే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాల సమాచారం. 65 ఏళ్ల వయసుల్లో ఉన్న జైట్లీకి మూత్రపిండాల మార్పిడి చికిత్స వెంటనే చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకే ఆయన సోమవారం నుంచీ ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న జైట్లీ 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బరువు తగ్గే సర్జరీ (బేరియాట్రిక్) చేయించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -