ముంచుకొస్తున్న జవాద్

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇవాళ ఉదయం వాయుగుండంగా మరింది. ఆ వాయుగుండం బలపడి తాజాగా తుఫాన్‌గా మారింది. దీంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్ లోటత్తు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

ఈ తుఫాన్‌కు జవాద్‌ తుఫాన్‌గా వాతావరణ శాఖ అధికారులు నామకరణం చేశారు. ఈ జవాద్ తఫాన్ విశాఖ, శ్రీకాకుళం జిల్లాల మధ్య తీరం దాటే అంకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ పట్నం, తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్లు నేడు, రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ సిబ్బంది సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది.

- Advertisement -

సీఎం జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా ఉత్తరాంధ్ర జిల్లా అధికారుతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో పరిస్థితి ఏవిధంగా ఉంది, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వారితోపాటు వైసీపీ ప్రజా ప్రతినిధులు అణుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

తెలంగాణలోకి ఒమైక్రరాన్‌ ప్రవేశించిందా?

ఢిల్లీ లో మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు

ఉత్తరాంధ్రకు భారీ ముప్పు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -