ఉత్తరాంధ్రకు భారీ ముప్పు!

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తుఫానుగా మారింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కేరటాలు 5 మీటర్లకు ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై పడింది. ఇది ఉత్తరాంధ్రవైపు పయనిస్తుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి.

సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమీవేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తుఫానుగా మారిందని, నేటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

- Advertisement -

అవసరమైన చోట సహాయక శిభిరాలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. తీరం వెంబటి గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంత ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

భారత్‌లోకి ఒమైక్రాన్?

పులివెందులో దారుణం..

ధ్వంసమైన తిరుమల ఘాట్ రోడ్డు..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -