Saturday, May 4, 2024
- Advertisement -

హెల్మెట్ లేకున్నా ఫైన్ వేయడానికి ఇబ్బంది పడుతున్న పోలీసులు..ఎందుకో తెలుసా…?

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారీ జరిమాణాలతోతో కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో వాహనదారులు బండ్లను బయటకు తీయాలంటె వణికిపోతున్నారు. లైసెన్స్ తోపాటు బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే రోడ్లపై తిరుగుతున్నారు. ఇక ప్రస్తుతం పులి, సింహాల కంటే ట్రాఫిక్ పోలీసులను చూస్తేనే వాహనదారులు భయపడుతున్నారు. పొరపాటు హెల్మెట్ లేదనీ, బైక్ కు సీటు బెల్టు లేదని ఎక్కడ జరిమానా వేస్తారో? అంటూ దడుచుకుంటున్నారు.

ఇలా ఉంటె గుజరాత్ లో మాత్రం టూవీలర్ వాహణ దారుడు హెల్మెట్ లేకున్నా దర్జాగా తిరుగుతున్నారు. అతనికి పోలీసులు ఫైన్ వేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మనకెందుకు వచ్చిన గొడవలే.. అంటూ వదిలేస్తున్నారు. అతనేమి వీఐపీకాదు. సాదారణ పౌరుడే. గుజరాత్ లోని ఛోటా ఉదయ్ పూర్ జిల్లాకు చెందిన జకీర్ మెమెన్ కొత్త నిబంధనలు పట్టించుకోకుండా హాయిగా బైక్ పై వెళుతున్నాడు. పోలీసులు అడ్డుకొని అతనికి భారీగా ఫైన్ వేశారు. అయితే తాను ఈ జరిమానాను కట్టబోనని మెమెన్ స్పష్టం చేశాడు.

ఉదయ్ పూర్ మొత్తం గాలించినా తన తల సైజుకు తగ్గ హెల్మెట్ దొరకలేదని వాపోయాడు. తన సైజు హెల్మెట్ ఎక్కడ దొరుకుతుందో చెబితే కొనుక్కుంటానని వేడుకున్నాడు. దీంతో పోలీసులు సమీపంలోని హెల్మెట్ షాపులో ప్రయత్నించగా, ఏ ఒక్క హెల్మెట్ కూడా మెమెన్ తలకు సరిపోలేదు. అతని దగ్గరున్న పత్రాలను పరిశీలించిన పోలీసులు అన్ని కరెక్టుగానె ఉండటంతో ఎలాంటి ఫైన్‌ వేయకుండా ట్రాఫిక్‌ పోలీసులు వదిలేశారు.దీంతో ట్రాఫిక్ పోలీసులను చూసి ఓవైపు ప్రజలు భయపడుతుంటే, మెమెన్ మాత్రం హాయిగా హెల్మెట్ లేకుండానే రోడ్లపై తిరిగేస్తున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -