Friday, April 19, 2024
- Advertisement -

గోరంట్ల మాధ‌వ్ నామినేష‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్టు …

- Advertisement -

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల మాధవ్‌కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మాధ‌వ్ నామినేష‌న్‌ను వేసుకోవ‌చ్చని తెలిపింది. మాధవ్ వ్యవహారంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్‌కు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఎంపీగా పోటీ చేయ‌డం ఖాయం అయ్యింది.

స్వ‌చ్చంధ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన మాధ‌వ్ వైసీపీలో చేరారు. ఆయ‌న‌కు హిందూపురం ఎంపీ టికెట్టును కేటాయించారు జ‌న‌గ్‌. అయితే ఆయ‌న వీఆర్ఎస్‌ను ప్ర‌భుత్వం ఆమోదించ‌క‌పోవ‌డంతో ఆయ‌న అభ్య‌ర్థిత్వంపై గంద‌ర‌గోలం నెల‌కొంది. వీఆర్ఎస్ ను ప్ర‌భుత్వం ఆమోదించ‌క‌పోతె ఆయ‌న నామినేష‌న్ వేసే అవ‌కాశం కోల్పోతారు. త‌న వీఆర్ఎస్‌ను ఆమోదించ‌క పోవ‌డంతో మాధ‌వ్ ట్రైబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించారు. ట్రైబ్యున‌ల్ ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయ‌న నామినేష‌న్‌ను ఈసీ స్వీక‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ట్రైబ్యున‌ల్ ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న దాఖ‌లు చేసింది. ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించింది. మాధ‌వ్ నామినేష‌న్ వేసుకోవ‌చ్చని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -