Sunday, May 12, 2024
- Advertisement -

ఇప్పుడు జగన్ పై మోడీ వైఖరి ఎలా ఉండబోతోంది?!

- Advertisement -

మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ లెవల్ పోరాటానికి సిద్ధం అయిపోయాడు. వచ్చే నెల అనగా.. ఆగస్టు పదో తేదీన జగన్ ఢిల్లీలో దీక్షను చేపట్టబోతున్నాడు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో జగన్ ఈ దీక్షను చేపట్టబోతున్నాడు. మరి ప్రత్యేక హోదా అంశం గురించి కేంద్ర ప్రభుత్వం కానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా ఉన్న నేపథ్యంలో ప్రతిఫక్ష నేత  ఈ అంశం గురించి స్పందిస్తున్నాడు. ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నాడు. 

ఇప్పటి వరకూ ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి ఢిల్లీ స్థాయిలో పెద్దగా జరిగిన పోరాటాలేమీ లేవు. తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఏదో చేసినా.. అది పవన్ కల్యాణ్ ను సంతృప్తి పరచడానికే చేసినట్టుగా ఉంది. ఇక కాంగ్రెస్ వాళ్లు చేస్తే.. అది నవ్వుల పాలు అవుతుంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ విభజనకు పాల్పడింది .. ఇప్పుడు ఆ పార్టీ ఏపీ గురించి మాట్లాడటం విడ్డూరం అవుతుంది. ఇప్పుడు జగన్ స్పందిస్తున్నాడు.

మరి ఇప్పుడు జగన్ దీక్ష పట్ల మోడీ సర్కారు ఎలా వ్యవహరిస్తుంది? అనేది ఆసక్తికరమైన అంశం. సాధారణంగా ఢిల్లీలో ధీక్షలను, ధర్నాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయదు. ఇలాంటి నేపథ్యంలో జగన్ అక్కడ దీక్షకు దిగుతున్నాడు. ముందస్తు అనుమతులు తీసుకొనే దీక్షకు దిగినా.. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి జరుగుతున్న ఈ ప్రయత్నం పట్ల మోడీ సర్కారు ఎలా స్పందిస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -