Friday, March 29, 2024
- Advertisement -

బాబోయ్ ఆ గుడ్డుతో 15 మందికి ఆమ్లెట్ వేయొచ్చు!

- Advertisement -

మనం నిత్యం ఆహారంలో ఎక్కువగా ఇష్టపడి తినే కోడి గుడ్డుతో ఒక ఆమ్లెట్ లేదా కాస్త ఉల్లిపాయలు దట్టించి వేస్తే రెండు ఆమ్లెట్ లు వేసుకుంటాం. అయితే ఓ గుడ్డుతో ఏకంగా పదిహేను మందికి సింపుల్ గా ఆమ్లెట్ వేయొచ్చు అంటే నిజంగా షాక్ తినడం ఖాయం. అయితే అది కోడు గుడ్డు కాదు..  ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి అయిన ఉష్ట్రపక్షి గుడ్డు. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఆస్ట్రిచ్ పక్షులు వాటి ఆకారానికి తగినట్టే గుడ్లను భారీ సైజులో పెడుతుంటాయి. ఒక గుడ్డు బరువు రెండు కిలోలు ఉంటుంది. దీన్ని పగలగొట్టడం అంత సులువైన విషయం కాదు.

ఈ భారీ ఎగ్ ను ఉడకబెట్టాలంటే 90 నిమిషాలకు పైగా పడుతుందట.ఉష్ట్రపక్షి పొడవైన కాళ్ళు, మెడ భారీ ఆకారం కలిగిఉండడం ఈ పక్షి ప్రత్యేకత. ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న పక్షులు పెట్టే గుడ్లలో ఉష్ట్రపక్షి గుడ్డే అతి పెద్దది. ఈ పక్షి మిడుతలు, బల్లులు, పాములు మరియు ఎలుకలనును ఆహారంగా తీసుకుంటుంది. అయితే ఎక్కువగా విత్తనాలు, ఆకులు వంటి వృక్ష సంపాదనే తినడానికి ఇష్టపడుతుంది.  

ఇక తాను పీచు అధికంగా ఉన్న ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారం అరగడం కోసం ఇసుకలో తలపెట్టి ఇసుక , గులకరాళ్లు తిని ఆ ఆహారాన్ని అరిగించుకుంటుంది. దీని గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఉష్ట్రపక్షి గుడ్డుతో ఆమ్లెట్ వేస్తే 15 మంది లాగించేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక ఉష్ట్రపక్షి గుడ్డులో సుమారు 2000 కేలరీలు, 100 గ్రా కొవ్వు మరియు 235 గ్రా ప్రోటీన్లు ఉన్నాయి. భారీ సైజులో ఉండే ఉష్టపక్షి గుడ్డు 28 పెద్ద కోడి గుడ్లను కలిపితే ఎంత ఉంటుందో ఈ పక్షి గుడ్డు అంత ఉంటుంది.

ఒక కోడి గుడ్డులోని కొలెస్ట్రాల్ కంటెంట్‌తో పోల్చినప్పుడు ఉష్ట్రపక్షి గుడ్డులో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది. లండన్ లోని ఓ రెస్టారెంట్లో ఉష్ట్రపక్షి గుడ్లతో ప్రత్యేక వంటకాలు తయారుచేస్తుంటారు. ఇవి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయంటున్నారు. ఇందులో గుండె పనితీరును మెరుగుపరిచే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సెలీనియం, మాంగనీస్, జింక్ వంటి సూక్ష్మపోషకాలు కూడా మెండుగా ఉంటాయట. లండన్ లోని ఓ రెస్టారెంట్లో ఉష్ట్రపక్షి గుడ్లతో ప్రత్యేక వంటకాలు తయారుచేస్తుంటారు. ఇవి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -