Saturday, April 20, 2024
- Advertisement -

హిమాలయాల్లో ‘యతి’అడుగు జాడ‌ల‌ను ట్వీట్ చేసిన ఇండియ‌న్ ఆర్మీ… ఏది నిజం…?

- Advertisement -

మాలయ పర్వత సాణువుల్లో భారీ ఖాయంతో ఉండి ‘యతి’గా పిలవబడే మంచుమనిషి ఉన్నాడని దానికి సంబంధించిన ఆధారాల‌ను ఇండియ‌న్ ఆర్మీ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి ప‌వ‌ర‌కు యతిస‌గా ప‌లువ‌బ‌డే మంచు మ‌నిసి గురించి గతంలో పురాణాలు, పాత సినిమాల్లో వినే ఉంటారు. మొన్నటి వరకు కల్పితమనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు నిజంగానే హిమాలయాల్లో మంచు మనిషి జాడలు కనిపించాయట. మన ఇండియన్ ఆర్మీనే నిర్దారించింది. మంచు మనిషి పాదముద్రల ఫోటోల‌ను ఇండియ‌న్ ఆర్మీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. పలువురు పర్వతారోహకులు తాము కూడా అటువంటివి చూశామని కామెంట్లు పెడుతున్నారుదీంతో ఇప్పుడు అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది.

ఏప్రిల్‌ 9న సైనికుల బృందం హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లింది. నేపాల్ సమీపంలో మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో మంచు మనిషి అడుగులను బృందం గుర్తించింది. ఈ పాదముద్రలు 32 అంగుళాల పొడవు 15 అంగుళాల వెడల్పుతో ఉన్నాయని.. వీటిని పరిశీలించిన ఆర్మీ అధికారులు కచ్చితంగా ఈ అడుగులు ‘యతి’వే అంటున్నారు. ఫోటోలను కూడా ఆర్మీ ట్వీట్ చేసింది. గతంలో మకలు-బరున్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో మంచి మనిషి (యతి) అడుగులు కన్పించినట్లు సైన్యం చెబుతోంది. య‌తి మంచుమ‌నిషికి సంబంధించిన వాస్త‌విక ఆధారాలు ఉన్నాయ‌ని, ప్ర‌త్య‌క్ష‌సాక్షులు కూడా ఉన్న‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి

య‌తి నిజంగా ఉంటె అసలు అంత పెద్ద జీవి ఉందా, ఉంటే, ఇన్నాళ్లూ అది ఎవరి కంటా పడకుండా ఎలా బతుకుతోంది. ఎక్కడ జీవిస్తోంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -