Saturday, May 11, 2024
- Advertisement -

మోదీ ప్రభుత్వం పరుస్తున్న ఎర్ర తివాచీ

- Advertisement -

ఎఫ్డిఐ. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. గతంలో ఈ మాట ఎక్కువగా వినపడేది. రానురాను కేంద్ర పెద్దల నుంచి ఈ మాట వినపడడం మానేసింది. మళ్లీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మాటను వినిపించేందుకు చర్యలు తీసుకుంటోంది.

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాదు.. విదేశీ సంస్ధలకు ఎర్రతివాచీ పరిచి మరీ తీసుకురావాలని నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఓ కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు దేశంలోని ప్రధాన రంగాలైన రక్షణ, పౌర విమానయానం, ఫుడ్ ప్రాసెసింగ్ ల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని ఆ సమావేవంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో యాపిల్ వంటి కంపెనీలో భారత్ లో తమ సొంత స్టోర్లు తెరవాలన్న కల కూడా నిజం కాబోతోంది.

ఈ కొత్త నిర్ణయంతో విదేశీ సంస్ధలు ఇక నుంచి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతి తీసుకోకుండా నేరుగా పెట్టుబడులతో భారత్ లోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. విదేశీ పెట్టుబడులకు భారతదేశం ఎంతో అనువైన దేశంగా ప్రపంచానికి చాటేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తయారు చేసేందుకు చర్యల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అన్నారంటే దీని వెనుక ఎంత కసరత్తు జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -