Wednesday, May 8, 2024
- Advertisement -

భార‌త గ‌గ‌న‌త‌లంలో పాక్ యుద్ధ‌విమానం చ‌క్క‌ర్లు.. ఖండించిన ఐ.ఏ.ఎప్‌. దేనికి సంకేతం….

- Advertisement -
Indian Air Force says No airspace violation over Siachen

గ‌త కొద్దికాలంగా భార‌త్ ….పాక్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.ఇవి ఇప్పుడు తార‌స్థాయికి చేరాయి.జమ్మూకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ ఆవల నౌషెరా సెక్టార్‌లో నాలుగు పాక్ బంకర్లను ధ్వంసం చేసినట్టు భారత్ వీడియేల‌ను విడుద‌ల చేసింది.దీంతో పాకిస్థాన్ ర‌గిలిపోతోంది.

ప్ర‌తీకార దాడుల‌కు సిద్ధ‌మ‌య్యింద‌నే వార్త‌లు ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.వీట‌న్నింటికీ భార‌త స‌రిహ‌ద్దుల్లో చోటు చేసుకున్న సంఘ‌ట‌న యుధ్దానికి సంకేతాల‌నిస్తోంది,
తాజాగా పాకిస్థాన్‌ వైమానిక దళానికి చెందిన జెట్‌ విమానాలు సరిహద్దుల్లోని సియాచిన్‌ గ్లేసియర్‌ సమీపంలోకి చొచ్చుకొచ్చినట్టు ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజే పాకిస్థాన్‌ మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడింది.ఈ కథనాలను భారత్‌ వైమానిక దళం నిర్ద్వంద్వంగా ఖండించింది. సియాచిన్‌లోని భారత గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది.

{loadmodule mod_custom,Side Ad 1}
పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ సోహైల్‌ అమన్‌ సరిహద్దుల్లోని స్కర్దు ప్రాంతంలో ఉన్న ఖాద్రి వైమానిక స్థావరాన్ని సందర్శించారని పాక్‌ మీడియా పేర్కొన్నది. ఇక్కడ ఉన్న తమ ఎయిర్‌ఫోర్స్‌ స్థావరాలన్నింటినీ భారత ముప్పును ఎదుర్కొనేందుకు పాక్‌ క్రియాశీలం చేసినట్టు మీడియా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పాక్‌ ఎయిర్‌ చీఫ్‌ అమన్‌ తానే స్వయంగా మిరాజ్‌ జెట్‌ విమానాన్ని నడుపుతూ.. సియాచిన్‌ సమీపంలోకి చొచ్చుకొచ్చినట్టు కథనాలు వండివార్చింది. ఈ కథనాలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

{loadmodule mod_custom,Side Ad 2}
నియంత్ర‌న రేఖ‌వెంబ‌డిపదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు రాకెట్లు, మోర్టార్లతో పాక్ బంకర్లు ధ్వంసం చేసినట్టు భారత సైన్యం ప్రకటించిన మరుసటి రోజే పాక్ మీడియా నుంచి యుద్ధ కథనాలు వెలువడుతుండటంపై ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి.

Also read

  1. ట్రంప్ నిర్ణ‌యంతో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు
  2. స‌రిహ‌ద్దుల్లో పాక్ శిభిరాల‌ను పూర్తిగా ధ్వంసం చేసిన సైనిక ద‌ళాలు
  3. కుటిల పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భార‌త్ స‌న్న‌ద్ధం…
  4. పాకిస్థాన్ అణు క్షిప‌ణుల ర‌హ‌స్య స్థావ‌రం బ‌ట్ట‌బ‌య‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -