- Advertisement -

బ్రింగ్ బ్యాక్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్…నూతన్ నాయుడు సంజన పేర్లే ట్రెండింగ్

- Advertisement -

ఏదైనా జరగొచ్చు…అంటూ బిగ్ బాస్ షోలో ఆసక్తి పెంచుతున్న హోస్ట్ నానీ, ఈ వారం మరింత ఆసక్తి పెంచేస్తూ బ్రింగ్ బ్యాక్ యువర్ ఫెవరెట్ కంటెస్టెంట్ అనే కొత్త గేమ్ ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. బ్రింగ్ బ్యాక్ యువర్ ఫేవరెట్ కంటెస్టంట్ పేరుతో ఈ వారం కొత్త గేమ్ స్టార్ట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్లలో మీకు ఇష్టమైన వారికి ఓటు వేసి, మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోని మీరే రప్పించుకోండి…అంటూ ప్రేక్షకులకు ఆఫర్ ఇచ్చాడు. ఇంతవరకూ తమకు నచ్చని కంటెస్టెంట్ కు తక్కువ ఓట్లు పడేలా, ఓటింగ్ లో పాల్గొన్న ప్రేక్షకులు, ఇప్పుడు నచ్చిన వారి కోసం ఓటింగ్ లో పాల్గొన వచ్చు.

మొదటి వారం సంజన, రెండో వారం నూతన్ నాయుడు, మూడో వారం కిరీటి, నాలుగో వారం యాంకర్ శ్యామల, ఐదో వారం భానుశ్రీ, ఆరో వారం తేజశ్వి ఎలిమినేట్ అయ్యారు. సంజన, నూతన్ నాయుడు ఎలిమినేషన్ విషయంలో తీవ్ర విమర్శల పాలయ్యారు బిగ్ బాస్ నిర్వాహకులు. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చినందుకే వారిద్దర్నీ ఎలిమినేట్ చేసేశారని, మూడో వారం గణేశ్ ను ఎలిమినేషన్ తప్పదని మండిపడ్డారు. షో నిర్వహణ అంతా డ్రామా, పక్కా స్క్రిప్ట్ అంటూ ట్రోలింగులు మొదలు పెట్టారు. దీంతో మూడోవారం ఎలిమినేషన్ గండం నుంచి గణేశ్ గట్టెక్కాడు. ప్రస్తుతానికి షోలో కొనసాగుతున్నాడు. మూడో వారం నుంచి ప్రేక్షకుల ఓట్లు, వారి అభిమానం, అభిప్రాయాలకు అనుగుణంగానే కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. తేజశ్వికి ఓట్లు పడకపోయినా, ఆమె ఎందుకు కొనసాగుతుందో అర్ధం కావడం లేదని చాలామంది తీవ్ర విమర్శలు చేస్తూ, ఆమెకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో టీవీ9 దీప్తి, రోల్ రైడా తాజాగా ఆరో వారం ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. ప్రేక్షకులను మెప్పించలేకపోగా, వారి ఆగ్రహానికి గురైన తేజశ్వి ఎలిమినేట్ అయిపోయింది.

అయితే ఇంతవరకూ ఆరుగురు ఎలిమినేట్ అయినా, సంజన, నూతన్ నాయుడు హౌసులో ఉంటే బాగుండును అనే భావన ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల్లో ఉంది. తేజశ్వి, భానుశ్రీ, శ్యామల కంటే బాగా సంజన ప్రవర్తన ఉండేదని, ఉన్నది ఉన్నట్టు, సూటిగా సుత్తిలేకుండా, కుండబద్దలు కొట్టేసినట్లు మాట్లాడేదని చెబుతున్నారు. సంజన్ రీ ఎంట్రీ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. నూతన్ నాయుడు కూడా నిజాయతీగా ఆడుతుండేవాడని, ఆయన బిహేవియర్ కూడా బాగుండేదని కితాబిస్తున్నారు. నూతన్ నాయుడుని, తేజశ్వి టీమ్ టార్గెట్ చేయకపోయి ఉంటే ఇంతవరకూ కొనసాగేవాడని చెబుతున్నారు. ఎలిమినేట్ అయ్యాక ఆయన ఇంటర్వ్యూలు చూశాక, ఆయనంటే ఏంటో అర్ధమయిందని చాలామంది చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఆరుగురిలో మీ అభిమాన కంటెస్టెంట్ ను మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటే వారికి ఓటు వేయండి. మళ్లీ హౌస్ లోకి రప్పించండి.. అంటూ నానీ చెప్పాడు. సోమవారం రాత్రి 11 గంటల నుంచి ఓటింగ్ ఉంటుందన్నాడు.

ఈ నేపథ్యంలో మొదటి స్థానంలో నూతన్ నాయుడు, రెండో స్థానంలో సంజన పేర్లు ట్రెండింగ్ అవుతున్నాయి. తర్వాత మూడో స్థానంలో యాంకర్ శ్యామల, నాలుగో ప్లేస్ లో కిరీటి, ఐదో ప్లేస్ లో భానుశ్రీ, ఆఖరి ప్లేస్ లో తేజశ్వి ఉన్నారు. 90 శాతం మంది నూతన్ నాయుడి పేరు సజెస్ట్ చేస్తుంటే, 5 శాతం మంది కూడా తేజశ్వి పేరు సజెస్ట్ చేయడం లేదు. సో నూతన్ నాయుడు లేదా సంజన బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -