Sunday, May 12, 2024
- Advertisement -

మంత్రి సోమిరెడ్డికి ఘోర అవ‌మానం… మాట‌కు క‌ట్టుబ‌డ‌తాడా…..?

- Advertisement -

ఈసీ నింబంధ‌న‌లు టీడీపీ ప్ర‌భుత్వానికి నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. ఈనెల 23 వ‌ర‌కు ఈసీ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. దీంతో ప‌రిపాల‌న అంతా ఈసీ చేతుల్లోకి టీడీపీ ప‌రిస్థితి కోర‌లు పీకేసిన పాములా త‌యార‌య్యింది. సీఎం నుంచి మంత్రుల వ‌ర‌కు అంద‌రూ డ‌మ్మీలుగా మారారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండగా ఎవ‌రూ కూడా ఆయాశాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేయ‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే ఈసీ సూచించింది. దీంతో అధికారులు కూడా మంత్రుల స‌మీక్ష‌ల‌కు వెల్ల‌డంలేదు.

దీంతో సీఎం చంద్ర‌బాబుతో స‌హా మంత్రులు ఈసీ మీద సీఎస్‌మీద గుర్రుగా ఉన్నారు. వారం రోజుల క్రితం మంత్రి సోమిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాశాఖ‌ల‌పై స‌మీక్ష చేస్తాన‌ని ఎవ‌రు అడ్డుకుంటారో చూస్తాన‌ని స‌వాల్ విసిరారు. అంతేనా …తాను నిర్వహించే సమీక్షలకు అధికారులకు సహకరించకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని వారం రోజుల క్రితం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈరోజు (బుధ‌వారం) త‌న శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హంచేందుకు స‌చివాల‌యానికి వెల్లిన సోమిరెడ్డికి అధికారులు రెండో సారి షాక్ ఇచ్చారు.సమీక్షకు రావాలని ఆదేశించినా… అధికారులు రాకపోవడంతో ఆయన తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. చేసేదేమిలేక అక్క‌డ‌నుంచి వెల్లిపోయారు.

కరవు అకాల వర్షాలపై సమీక్ష నిర్వహించాలని భావించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… ఇందుకు సంబంధించి వారం క్రితమే అధికారులకు సమాచారం అందించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు ఈ సమీక్షకు హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సోమిరెడ్డి… మంగళవారం తన సమీక్షా సమావేశాన్ని రద్దు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సీమీక్ష‌కు అధికారులు ఎవ‌రూ హాజ‌రు కాకుంటె మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన్న వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న క‌ట్టుబ‌డి ఉంటారా లేకా మ‌న‌సు మార్జుకుంటారా అన్న‌ది అంద‌రిలో ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -