- Advertisement -

ఊహించని ప్లాన్ వేసిన జగన్.. టీడీపీ, జనసేన పరిస్థితి ఏంటి..?

- Advertisement -
Jagan Political Strategies About Tdp Jenasena

ట్వీట్టర్ లో ట్వీట్ల‌తో కామెంట్లు చేసే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. కాట‌మ‌రాయుడు కంప్లీట్ అవ్వగానే మరో రెండు చిత్రాలు చేయడానికి ఓప్పుకున్నారు. ఇంకో చిత్రం చర్చల దశలో ఉంది. సినిమాలతో బిజీగా ఉంటునే.. రాష్ట్ర సమస్యపై మాత్రం పట్టు వదలకుండా.. పోరాడుతున్నాడు. 2014లో మిస్ అయిన చాన్స్ ని ఎట్టిప‌రిస్థితుల్లో 2019లో ద‌క్కించుకోవాల‌నే ఆశ‌తో యాత్ర‌లు.. ర్యాలీలు.. ఉద్య‌మాలంటూ ఏపీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగానే నిల‌దీస్తున్నారు.

అయితే జ‌న‌సేన నేత సంధించిన ప్ర‌శ్న‌లు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తెలుగుదేశం పార్టీ స్పందిస్తున్న తీరు కూడా వైసీపీనేత‌ల‌కు గుబులు పుట్టిస్తోంది. ఓ వైపు జ‌న‌సేన‌, టీడీపీ స‌మాంత‌రంగా ప్ర‌జ‌ల్లో పాజిటివ్ మార్కులు కొట్టేస్తున్నాయి. అలా అని టీడీపీ, జ‌న‌సేన‌లో  త‌ప్పుల్లేవా అని కాదు.. వారి లెక్కలు వారికి ఉన్నాయి. చాలా సందర్భాల్లో జగన్ అవినీతి ఎత్తి చూపుతున్నారు టీడీపీ నాయకులు.

దాంతో జగన్ ఓ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అతి త్వరలో విజయవాడకు వెళ్లి అక్కడ నుంచి పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాడట. టీడీపీ వల్ల ప్రజలకు కలిగే నష్టాలను చూపే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నాడట. ఈ సారి ఎలాగో పవన్ టీడీపీతో కలవడం లేదు.. టీడీపీ కి గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా జగన్ రెడీ అవుతున్నారు. టీడీపీ, జనసేన వేరు చేయ‌టం ద్వారా వైసీపీ లాభ‌ప‌డుతుంద‌నే అంచ‌నాతో వ్యూహాల‌కు ప‌ద‌ను పెట్టే ప‌నిలో జ‌గ‌న్ వర్గం ఆలోచనలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -