ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ సంఘటనను తలపించే మరో ఘోరమైన సంఘటన వెలుగు లోకి వచ్చింది. అది చేసింది ఏపోరంబోకులో కాదు…రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈఘోరానికి ఒడి గట్టారు.అది కూడా పోలీస్టేషన్‌లోనే. జమ్మూలోని కనాలాల్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది.
జమ్మూ కానాచక్ ప్రాంతానికి చెందిన ఓ మహిళను (25) దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కనాలాల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆమెపై నిర్భయ గ్యాంగ్ రేప్ తరహాలో తీవ్ర హింసను ప్రయోగించడంతోపాటు, లైంగికంగా కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కస్టడీలో ఉన్నపుడు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన బాధితులరాలు తకు జరిగిన అన్యాయంపై న్యాయవాది సహాయంతో పోరాటానికి సిద్దపడింది.
{loadmodule mod_custom,Side Ad 1}
స్టేషన్ ఎస్.హెచ్.ఒ. రాకేశ్ శర్మ వారం రోజులపాటు తనను హింసించిన తీరును బాధితురాలు మీడియాకు వివరించింది. తీవ్రమైన హింసతోపాటు, లైంగిక దాడికి పాల్పడ్డాడని, ప్రయివేట్ పార్ట్స్ లో బీర్ బాటిల్ చొప్పించేందుకు ప్రయత్నించాడని, కారంపొడిని చల్లారని ఆరోపించింది.నీళ్ళు అడిగితే, మూత్రం త్రాగమంటూ పోలీసులకు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించింది.
బాధితురాలి తరపు న్యాయవాది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్భయ కేసులోమాదిరిగా పోలీసులు ప్రవర్తించారని మండిపడ్డారు.రక్షణ కల్పించాల్సిన పోలీసులే బాధితురాలిపై క్రూరత్వాన్ని చాటుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ సంఘటనపై వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఉదంతంపై ర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
{loadmodule mod_sp_social,Follow Us}
